You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది 'పీవోకే'పైనే: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
పాకిస్తాన్‌తో కనుక చర్చలంటూ జరిగితే ఇకపై అది 'పాక్ ఆక్రమిత కశ్మీర్'పై మాత్రమేనని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
హరియాణాలోని పంచకులాలో ఓ ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''పాకిస్తాన్‌తో చర్చలు జరగాలని కొందరు అంటున్నారు. కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపేవరకు అలాంటి ప్రసక్తే ఉండదు' అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు.
హరియాణాలో ఎన్నికల సందర్భంగా 'జన్ ఆశీర్వాద్ యాత్ర'లు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 8తో ఇవి ముగుస్తాయి.
ఈ యాత్రల ప్రారంభం నుంచి రాజ్‌నాథ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
అందులో భాగంగా ఆయన ఇటీవల ''బీజేపీ రాజకీయాలు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాదు దేశ నిర్మాణం కోసమూ ఉంటాయ''ని ఆయన పేర్కొన్నారు.
ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ అభివృద్ధిలో అక్కడి యువతను భాగస్వాములను చేయాలనీ ఆయన తన ట్వీట్లలో రాశారు.
బాలాకోట్ కంటే పెద్ద దాడికి భారత్ ప్రయత్నిస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారని.. అంటే బాలాకోట్‌లో దాడి జరగలేదంటూ ఇంతకాలం ఖండిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరించినట్లేనని ఆయన ఎన్నికల సభలో అన్నారు.
''మన పొరుగుదేశం అంతర్జాతీయ సమాజం తలుపు తడుతోంది. భారత్ పెద్ద తప్పు చేసిందని చెబుతోంది'' అంటూ పాకిస్తాన్ పేరెత్తకుండా అన్నారు.
ఇటీవలే ఆయన అణ్వస్త్రాలను వాడే విషయంలోనూ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధాలను తొలుత తాము ప్రయోగించకూడదన్న విధానాన్నే భారత్ ఇప్పటికీ పాటిస్తోందని.. భవిష్యత్తులో ఈ విధానం ఎలా ఉంటుందన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)