'నందాదేవి' అధిరోహణలో చనిపోయిన పర్వతారోహకుల చివరి వీడియో

వీడియో క్యాప్షన్, 'నందాదేవి' అధిరోహణలో చనిపోయిన పర్వతారోహకుల చివరి వీడియో

భారత్‌లోని రెండో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతం నందాదేవిని అధిరోహించేందుకు వెళ్లి చనిపోయిన పర్వాతారోహకుల బృందం చివరి వీడియో ఒకటి లభించింది.

ఇందులో ఒక భారతీయ గైడ్, నలుగురు బ్రిటన్ వాసులు, ఇద్దరు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియన్ హిమాలయాల్లోని ఒక శిఖరాన్ని తాడు సాయంతో అధిరోహిస్తున్నారు.

ఈ పర్వతారోహకులు మే 13న నందాదేవి అధిరోహణను మొదలుపెట్టారు. వీరికి మే 26న బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

బృందంలో ఏడుగురి మృతదేహాలు జూన్‌లో దొరికాయి. అనుభవజ్ఞుడైన బ్రిటన్ పర్వతారోహక గైడ్ మార్టిన్ మోరాన్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు.

ఏడుగురి మృతదేహాలను వెలికితీసిన ప్రదేశానికి సమీపంలోనే ఈ వీడియో ఉన్న 'గోప్రో' కెమెరా లభించింది. ఇది మంచులో కప్పుకొనిపోయి ఉంది.

ఒక నిమిషం 55 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) అధికారులు సోమవారం విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)