వీడియో: ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న క్యాన్సర్ బాధితురాలు
ఆ 'పెళ్లికూతురు' చక్కగా నుదుటి మీద తిలకం దిద్దుకున్నారు. లిప్‌స్టిక్, చేతులను, కాళ్లను గోరింటాకుతో అలంకరించుకున్నారు. అందమైన చీర కట్టుకున్నారు.
ఇందులో వింతేముంది? ఏ పెళ్లి కూతురైనా ఇలాగే తయారవుతారు కదా! అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. మీ అనుమానం సరైనదే, కానీ ఈ పెళ్లికూతురి పూర్తి కథ మీకు తెలిసి ఉండదు.
ఈ 'పెళ్లి కూతురు'కి పూలజడ లేదు, అసలు జడే లేదు. అసలు తలమీద దాదాపు వెంట్రుకలే కనిపించడంలేదు.
ఈమె పేరు వైష్ణవి పువేంద్రన్ పిళ్లై. సన్నిహితులు ప్రేమగా నవీ అని పిలుస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పేరు నవీ ఇంద్రాణ్ పిళ్లై. వీరి పూర్వీకులది తమిళనాడు. కొన్ని దశాబ్దాల క్రితం మలేషియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వైష్ణవి ప్రస్తుతం మలేషియాలోనే ఉంటున్నారు.
వైష్ణవి రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అయోమయం: భారత వ్యతిరేక మిలిటెంట్ల విషయంలో ఏం చేయాలి?
- “రైతుబంధు, అన్నదాత సుఖీభవ పథకాలు మాకొద్దు.. మమ్మల్ని ఇలా వ్యవసాయం చేసుకోనివ్వండి”
- 'ఛాతిపై టాటూ వేయించుకున్నానని, తోడు పెళ్లికూతురిగా కూర్చోవద్దన్నారు'
- 'ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశం మంచిదే... కానీ, మోదీ ఎలా ఉన్నారంటే...' - పర్వేజ్ ముషారఫ్‌తో బీబీసీ ఇంటర్వ్యూ
- పాకిస్తాన్‌ను ఉర్రూతలూగిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక
- ‘ఈ కండలు పెంచడానికి ఆటో నడిపా..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)