#Dreamgirls: ‘తెలుగు పరిశ్రమ చాలా మారిపోయింది’
అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలోనూ మహిళల పట్ల అడ్వాంటేజ్ తీసుకోడానికి ప్రయత్నించేవారు ఎక్కువగానే ఉంటారని, అయితే అలాంటి వారిని బలంగా ఎదుర్కోవాలని సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత ప్రియాంక దత్ అన్నారు.
బాలు, జై చిరంజీవ, శక్తి సినిమాలకు ఆమె సహనిర్మాతగా వ్యవహరించారు.
టాలీవుడ్‌లో మహిళలు, ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రియాంక దత్ బీబీసీకి వివరించారు.
తెలుగు సినిమా రంగంలో ఇటీవల అన్ని విభాగాల్లో మహిళా సాంకేతిక నిపుణులు ఎక్కువగానే కనిపిస్తున్నారని ఆమె చెప్పారు. ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకునే ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు.
''సినిమా కుటుంబం నుంచి వస్తే మొదటి సినిమా చేయడానికి అవకాశం వస్తుంది. కానీ, మనం బాగా కష్టపడితేనే తరవాత అవకాశాలు ఉంటాయి. సలహాలు ఇచ్చే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఇది మంచిది, ఇది కుదరదు అంటారు. సినీరంగంలోకి ఎందుకు రావడం అని అమ్మాయిలను నిరుత్సాహపరిచే వారూ ఉంటారు'' అని ప్రియాంక తెలిపారు.

ఈ రంగంలో ఎక్కువ మంది మహిళా డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.
''సినిమాల పట్ల మహిళల దృక్కోణం భిన్నంగా ఉంటుంది. సున్నితంగా ఆలోచిస్తారు. అందుకే ఎక్కువ మంది మహిళా డైరెక్టర్లు, సాంకేతిక నిపుణుల కోసం చూస్తున్నా'' అని తెలిపారు.

గతంతో పోల్చి చూస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో మహిళలు ఎక్కువగానే కనిపిస్తున్నారని చెప్పారు.
'' ఇప్పుడు నేను చాలా మంది మహిళా రైటర్స్‌ని, అసిస్టెంట్ డైరెక్టర్లను టాలీవుడ్‌లో చూస్తున్నా. నా దగ్గర ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. గతంలో సినీరంగంలోకి అమ్మాయిలు వెళ్లకూడదన్న భావన ఉండేది. ఇప్పుడు అది మారుతోంది'' అని అభిప్రాయపడ్డారు.
సినిమా తీసే విధానం తనకు చాలా సరదాగా అనిపిస్తుందని.. అయితే, సినిమా విడుదలయ్యే సమయంలో మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటానని చెప్పారు.
రిపోర్టింగ్: సంగీతం ప్రభాకర్,షూట్ ఎడిట్: నవీన్ కుమార్
ఇవి కూడా చదవండి
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- ఏది 'సెక్స్', ఏది 'రేప్'?
- చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- పలక, బలపం పడుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- #MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









