ఎలక్టోరల్ బాండ్స్, ఈడీ దాడులు, కాంట్రాక్టులు... వీక్లీ షో విత్ జీఎస్
గత ఏడాది రెండొందల కోట్లకు పైగా లాభం చూపించిన ఒక లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ రాజకీయ పార్టీలకు వెయ్యి కోట్లకు పైగా ఎలా ఇవ్వగలిగింది, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేతికి ఎముక లేదన్నట్టుగా రాజకీయ పార్టీలకు వెయ్యికి పైగా కోట్లు ఎలా సమర్పించింది, ఎందుకు సమర్పించింది.
నవయుగ సంస్థ గత ఏడాది రికార్డు స్థాయిలో నష్టాలు చూపించినప్పటికీ రాజకీయ పార్టీలకు 55 కోట్లు ఎలా ఇవ్వగలిగింది. హెటిరో, మై హోమ్ , రిత్విక్, బిర్లా సహా ఇంకా అనేకానేక కంపెనీలు కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు ఎందుకిచ్చాయి, ఎలా ఇచ్చాయి, ఎపుడిచ్చాయి ..ఇవ్వన్నీ ఇపుడు చాలామందిలో మెదిలే ప్రశ్నలు.
అలాగే, బిజెపి ఒక్క పార్టీకే సింహభాగం అంటే ఏడు వేల కోట్లు డబ్బు దక్కడంలో పనిచేసిందేమిటి, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయాలనికి ముందు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఎందుకు పార్టీలకు ఇచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈడీ దాడులు జరిగిన తర్వాత లేదా నోటీసులు అందుకున్న తర్వాత పార్టీలకు డబ్బులు ఎలక్ర్టోరల్ బాండ్స్ రూపంలో ముట్టచెప్పిన కంపెనీల కథేంటి? దానికి దీనికి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ ప్రశ్నలే.
సిబిఐ, ఈడీ, ఇన్ కంటాక్స్ దాడులు చేసి కంపెనీలను బెదిరించి విరాళాల రూపంలో బిజేపీ డబ్బులు పొందిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లాంటి వారు ఆరోపిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ నగదులో దాదాపు సగభాగం పొందిన బీజేపీని మినహాయిస్తే ఇటు తృణమూల్ కాంగ్రెస్, బిఆర్ఎస్ జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు దాదాపు సమానంగా వేయికోట్లకు పైగా డబ్బు ఎలా పొందగలిగాయి? తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ అంత డబ్బు పొందడానికి వెనుక పనిచేసిందేమిటి?
ఇంతకీ ఈ ఎలక్ర్టోరల్ బాండ్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు అంత ఘాటుగా అన్ని సార్లు మొట్టికాయలు వేసినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు అందించడానికి ఎందుకింత తాత్సారం చేస్తున్నది? ఏంటి దీని కథా కమామీషు?
వీక్లీ షో విత్ జీఎస్‌లో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది...చట్టం ఏం చెబుతోంది?
- మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- మహిళలకు సున్తీ: ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని తొలగించడంపై గాంబియా మహిళలు ఏమంటున్నారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



