6 వందల కోట్లు, 7 వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం

వీడియో క్యాప్షన్, 6వందల కోట్లు, 7వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం
6 వందల కోట్లు, 7 వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. జనాభా పెరిగినా తగ్గినా... ఈ మైలురాయిని గుర్తుంచుకోవడం కోసం నవంబరు 15ని ఎంచుకున్నారు డెమోగ్రాఫర్లు.

ప్రపంచ చరిత్రలో జనాభా పెరుగుదల ప్రస్తుతం వైవిధ్య భరితంగా ఉంది.

ఇకపై జన్మించనున్న 50 కోట్ల మంది 8 దేశాల్లోనే పుట్టబోతుంటే.. చాలా దేశాల్లో జనాభా తగ్గుతోంది.

ప్రపంచ జనాభా 600, 700 కోట్ల సంఖ్యను చేరుకున్నప్పుడు పుట్టిన చిన్నారులుగా కొంతమందికి యూఎన్ పేరుపెట్టింది.

ప్రపంచ జనాభా పరిస్థితుల గురించి..అప్పుడు పుట్టిన వారి జీవితాలు.. ఏం చెబుతున్నాయి? బీబీసీ ప్రత్యేక కథనం.

ఓయ్‌షీ పుట్టిన రోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే యూఎన్ ప్రకారం.. ప్రపంచ జనాభా 700 కోట్లనే అంకెను చేరినప్పుడు పుట్టిన పుట్టిన చిన్నారుల్లో ఈమె ఒకరు.

11 ఏళ్ల తర్వాత ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ఓయ్‌షీ బంగ్లాదేశ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆ దేశ జనాభా సుమారు కోటి 70 లక్షలు. అదింకా పెరుగుతోంది.

1999లో ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకున్నప్పుడు పుట్టిన చిన్నారిలో అద్నాన్ మెవిక్‌కు అప్పటి ఐక్యరాజ్య సమిది ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ పేరు పెట్టారు.

2080 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకోవచ్చని యూఎన్ అంచనా వేస్తోంది.

6వందల కోట్లు, 7వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)