దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు

దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలిసి భారీ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది అమెరికా. అయితే తాము చైనాతో యుద్ధాన్ని కోరుకోవడం లేదని సైన్యాధికారులు అంటున్నారు.

తైవాన్‌ను దిగ్బంధించే రిహార్సల్స్ చైనా నిర్వహించిన కొద్ది రోజులకే ఈ సంయుక్త విన్యాసాలు ప్రారంభమయ్యాయి. చైనా చర్యలు సరైనవి కావని అమెరికా విమర్శిస్తోంది.

తైవాన్ తమదని చైనా వాదిస్తుండగా, తైవాన్ స్వతంత్రతకు మద్దతునిస్తామని అమెరికా అంటోంది. మొత్తంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రజలు రెండు అగ్రరాజ్యాల మధ్య చిక్కుకుపోయిన్నట్టు భావిస్తున్నారు.

ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బటనెస్ దీవి నుంచి బీబీసీ ప్రతినిధి లారా బికర్ అందిస్తున్న రిపోర్ట్.

అమెరికా, ఫిలిప్పీన్స్ విన్యాసాలు

ఫొటో సోర్స్, US MARINE CORPS/KYLE CHAN

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)