హాకా డ్యాన్స్‌తో న్యూజీలాండ్ పార్లమెంట్‌ను కుదిపేసిన ఎంపీ
న్యూజీలాండ్ పార్లమెంట్‌లో మావోరీ ఎంపీలు హాకా నృత్యంతో నిరసన వ్యక్తం చేశారు.
మావోరీలు అక్కడి ఆదివాసీలు. హాకా న్యూజీలాండ్ సంప్రదాయ నృత్యం.
దాదాపు 184 ఏళ్ల క్రితం బ్రిటన్, మావోరీ సభ్యుల మధ్య ఒక ఒప్పందం జరిగింది.
దాని ప్రకారం రెండు పార్టీల మధ్యా పాలనకు రాజీ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారమే ఇప్పటికీ న్యూజీలాండ్‌లో చాలా విధానాలను రూపొందిస్తారు.
న్యూజీలాండ్ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఒక పార్టీ ఈ ఒప్పందానికి సంబంధించి కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లుపై సభలో వివాదం నెలకొంది.
ఈ బిల్లు గురించే మావోరీ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంపీ హానా రావ్హితి మాయిపీ క్లార్క్ నిరసన ప్రారంభంలో కొత్త బిల్లు ప్రతులను చించేశారు.
మరికొందరు సభ్యలు కూడా వెల్‌లోకి వచ్చి హాకా నృత్యం చేయడం మొదలుపెట్టారు.
న్యూజీలాండ్‌లోని దాదాపు 53 లక్షల జనాభాలో 20 శాతం జనాభా మావోరీ సమాజం వారే.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









