దిల్లీ పేలుడు: ఎర్రకోట వద్ద ఈరోజు పరిస్థితి.. 9 ఫోటోలలో..

దిల్లీలో,ఎర్రకోట సమీపంలో నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు పేలుడులో 8 మంది చనిపోయారు.

పేలుడు ఎలా జరిగిందనే దాని గురించి సంఘటనా స్థలంలో శిథిలాలను పరిశీలిస్తున్న నిపుణుల బృందం.

పేలుడు జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది.

సంఘటనా స్థలంలో నిలిపి ఉంచిన ఫైర్ ఇంజిన్లు.

సోమవారం(నవంబర్ 10) రాత్రి జరిగిన పేలుడులో మరణించినవారి అవశేషాలకోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.

మంగళవారం(నవంబర్ 11) ఉదయం మార్చురీ వద్ద కనిపించిన హృదయ విదారక దృశ్యం. ఆత్మీయులను కోల్పోయి రోధిస్తున్న కుటుంబ సభ్యులు.

న్యూదిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10, 2025న జరిగిన కారు పేలుడులో గాయపడిన బాధితులను ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

పేలుడు తర్వాత పేలుడు స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు మానవ అవశేషాలను సేకరించారు.

ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత ఆ ప్రదేశంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)