హోలీ: దేశవ్యాప్తంగా రంగుల పండగ, తొమ్మిది ఫోటోలలో..

కోట్ల మంది భారతీయులు హోలీ వేడుకల్ని జరుపుకుంటున్నారు. శీతాకాలపు చివరి రోజుల్లో వచ్చే ఈ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహిస్తారు.

ఉదయాన్నే మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యం చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. స్వీట్లు పంచుకుంటారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని అనేక ప్రాంతాల్లో యువతీ యువకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కృత్రిమంగా ఏర్పాటు చేసిన నీటి జల్లుల్లో యువతీ యువకులు నృత్యాలు చేస్తున్నారు.

ఈ పండుగను తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు అనేకమంది నగరాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు.

రాధాకృష్ణుల మధుర ప్రేమకు గుర్తుగా మథురలోని బృందావన్‌లో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)