మధ్య తరగతి కష్టాలు: మహిళ రెండు ఉద్యోగాలు చేస్తున్నా.. తరగని ధరల భారం
మౌనిక తన భర్త, రెండో తరగతి చదివే బాబుతో కలిసి తిరుపతిలో ఉంటారు.
ఆమె భర్త డ్రైవరుగా పని చేస్తున్నారు. మౌనిక ఒకవైపు వాలంటీర్‌గా మరోవైపు న్యూస్ ప్రజంటర్‌గా మౌనిక పనిచేస్తున్నారు.
బాబుతో కలిపి ముగ్గురు సభ్యులన్న ఈ కుటుంబం.. భార్యాభర్తలు ఇద్దరూ కలిపి మూడు ఉద్యోగాలు చేస్తున్నా ఖర్చులు భరించలేకపోతోంది.
మధ్య తరగతి కుటుంబాలపై ధరల పెరుగుదల ప్రభావంపై బీబీసీ ప్రత్యేక కథనం.

మౌనిక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంఆర్ పల్లి వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు న్యూస్ ప్రజెంటర్‌గా కూడా పనిచేస్తున్నారు.
‘‘కొంతమంది కాల్ చేస్తారు. ఏ టైం అయినా లిఫ్ట్ చేయాలి వాటర్ ప్రాబ్లమ్ అంటారు. శానిటైజర్ ప్రాబ్లం అంటారు. స్ట్రీట్ లైట్ వెలగడం లేదంటారు. స్ట్రీట్ డాగ్స్ అంటారు. మాకు రైస్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదంటారు. అది చాలా రిస్క్ తో కూడుకున్న పని.
వాలంటీర్ గా నాలుగేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ న్యూస్ రీడర్‌గా త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ న్యూస్ రీడింగ్ మాత్రమే కాకుండా యాడ్స్ చదవడం, విఐపి ఎవరైనా వస్తే ఇంటర్వ్యూ చేయడం ఉంటుంది.’’ అని మౌనిక చెప్పారు.
మౌనిక తన భర్త, రెండో తరగతి చదివే బాబుతో కలిసి తిరుపతిలో ఉంటారు. ధరల పెరుగుదల, కుటుంబ పరిస్థితి దృష్ట్యా రెండు ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
రెండు పనులు చేస్తున్న మౌనికకు ఆమె భర్త శీను, తోటి ఉద్యోగులు అండగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: జనసేన ఆవిర్భావ సభలో స్వరం మార్చిన అధినేత... కులాల చుట్టూ సాగిన ప్రసంగం
- రష్యా జెట్ ఢీకొని సముద్రంలో కూలిన అమెరికా డ్రోన్
- తెలంగాణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం ఎలా జరిగింది?
- సిలికాన్ వ్యాలీ బ్యాంక్: భారత స్టార్టప్‌లు దివాలా తీసిన ఆ బ్యాంకులో ఖాతాలు ఎందుకు తెరిచాయి
- టైగర్ నాగేశ్వర రావు రియల్ స్టోరీ ఏమిటి? ఉన్నోళ్లను దోచుకుని, లేనోళ్లకు పంచేవాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



