21 ఏళ్లకే పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన యువతి.. ఈ యంగెస్ట్ సర్పంచ్ లక్ష్యం ఏంటో తెలుసా?
21ఏళ్ల అంజూ తన్వర్ హరియాణాలో అతితక్కువ వయసుగల సర్పంచ్.
హేంద్రగఢ్‌లోని ఖుదనా గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక్కడ నవంబరు 2న పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
ఈ పంచాయతీని మహిళల కోసం రిజర్వు చేశారు. ప్రచార సమయంలో గ్రామ అభివృద్ధి గురించి అంజు మాట్లాడేవారు.
బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ స్టడీస్ అండ్ మెడిసిన్ అంటే బీఏఎంఎస్ మొదటి సంవత్సరం అంజు చదువుతున్నారు.
గ్రామ పెద్దల సాయంతో సర్పంచ్ పనులు చూసుకుంటూ తాను చదువుకోగలనని ఆమె చెబుతున్నారు.
248 ఓట్ల మెజారిటీతో అంజు ఎన్నికల్లో గెలిచారు. ఆమెకు మొత్తంగా 1300 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థికి 1052 ఓట్లు వచ్చాయి.
అంజు తండ్రి డాక్టర్. ఈ విజయం కోసం అంజు చాలా కష్టపడ్డారని ఆయన అన్నారు. గ్రామానికి సర్పంచ్‌గా తను ఎలా పనిచేస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నామని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:
- జాక్వలిన్ ఫెర్నాండేజ్: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ‘మోసపోయిందా’ లేక ‘మోసపోయినట్లు నటించిందా’
- బిర్సా ముండా జయంతి: సొంత గ్రామం ఎంతగా అభివృద్ధి చెందింది.. ఆయన వారసుల పరిస్థితి ఏంటి
- మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు.. వైద్యులు చెబుతున్న కారణాలేంటి
- 8 నెలలుగా రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్లో ప్రజల జీవితం ఇప్పుడు ఎలా ఉంది
- క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి
- కొత్తిమీర: భారతదేశపు వంటల్లో మకుటం లేని మహారాణి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



