ఎనిమిది నెలలుగా రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్‌లో ప్రజల జీవితం ఇప్పుడు ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, ఎనిమిది నెలలుగా రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్‌లో ప్రజల జీవితం ఇప్పుడు ఎలా ఉంది?
ఎనిమిది నెలలుగా రష్యా అధీనంలో ఉన్న ఖేర్సన్‌లో ప్రజల జీవితం ఇప్పుడు ఎలా ఉంది?

ఎనిమిది నెలలుగా రష్యన్ల ఆధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో అనేక యుద్ద నేరాలు జరిగాయనడానికి అధారాలను పరిశోధకులు సేకరించినట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలియన్‌స్కీ అన్నారు. ఖేర్సన్ నగరంలో బ్రెడ్, మందుల సరఫరాలు అయిపోతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు అలానే ఉన్నాయి. నగరాన్ని విడిచి వెళ్లిన రష్యన్ బలగాలు షెల్లింగ్ చేస్తాయనే భయాల మధ్య - రాత్రి వేళల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. ఖేర్సన్ నుంచి బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ అందిస్తున్న కథనం.

తమ జీవితాలను తిరిగి సాధారణ స్థితిలో చూడాలని కోరుకుంటున్నారు ఖెర్సాన్‌లోని ప్రజలు.

ఖెర్సాన్ తీరంలోని లోతట్టు ప్రాంతాలను చూస్తే యుధ్దం ఇక్కడి ప్రజల జీవితాలను ఎలా మార్చేసిందో అర్థమవుతుంది.

మార్చి నెలలో నల్ల సముద్రం వైపుగా దూసుకొచ్చిన రష్యన్లు, ఇక్కడి యుద్ధాన్ని గెలిచారు. సోవియట్ యూనియన్‌లో యుక్రెయిన్ భాగమై ఉన్నప్పుడు లెనిన్‌కు అంకితం చేసిన ఈ స్కూల్‌ నుంచి వాళ్ళ బలవంతపు పాలనను రుద్దే ప్రయత్నం చేశారు.

అయితే ఇక్కడ చాలా యుద్ధ నేరాలు జరిగాయంటున్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్.

యుక్రేనియన్ సైనికులు విజయంతో వెనక్కు వస్తోన్న మార్గమంతా ఈ ప్రాంతంలోని రోడ్లపై గుర్తుతెలియని మృతదేహాలు పడి ఉన్నాయి.

ఇక ఖెర్సాన్‌లోని సెంట్రల్ స్క్వేర్ అంతా ప్రజలతో నిండిపోయింది. రష్యన్లు వెనక్కి వెళ్లడంతో ఇక్కడ ప్రజలు తమ ధిక్కారాన్ని , తిరిగి పొందిన స్వేచ్ఛను వేడుక చేసుకుంటున్నారు.

మెల్లగా, తర్వాత గంభీరంగా వీరంతా యుక్రేనియన్ జాతీయ గీతం పాడుతున్నారు.

వీళ్లలోని భావోద్వేగం ఉప్పొంగుతోంది. ఆక్రమణలు వదిలి వెళ్తోన్న లోతైన గాయాలను వీళ్లు దిగమింగుతున్నారు.

కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే ఈ నగరంలో యుద్ధం ఇంకా మిగిలే ఉంది.

ఖేర్సన్ లో ప్రజల సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)