ఎలక్షన్స్ 2024: పోలింగ్ కేంద్రాన్ని ఎలా నిర్ణయిస్తారు? పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్‌ల మధ్య తేడా ఏమిటి?
ఎన్నికల్లో పోలింగ్ రోజు చాలా కీలకమైంది. ఆ రోజే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేస్తారు. మరి, ఓటర్లు తమ అభ్యర్ధి ఎవరో నిర్ణయించుకుంటారు సరే, పోలింగ్ కేంద్రాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
పోలింగ్ స్టేషన్ కు పోలింగ్ బూత్ కు ఉన్న తేడా ఏంటి ? ఎన్నికలకు ముందు ఎలక్షన్ ఆఫీసర్లు ఎలాంటి సన్నాహాలు చేస్తారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

పోలింగ్ స్టేషన్ అంటే ఓటింగ్ నిర్వహించే భవనం లేదా ప్రాంగణం. పోలింగ్ స్టేషన్‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ 'పోలింగ్ బూత్‌లు' ఉండవచ్చు.
పోలింగ్ బూత్ అనేది చిన్న గదిలాంటి ప్రాంతం. ఇక్కడే ఓటర్లు వ్యక్తిగతంగా బ్యాలెట్ పేపర్ మీదనో, ఈవీఎం ద్వారానో ఓటు వేస్తారు.
పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ‘ప్రజాప్రాతినిధ్య చట్టం 1951’లో నిబంధనలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం కూడా వీటి విషయంలో కొన్ని మార్గదర్శకాలను తయారు చేసింది.
ఇవి కూడా చదవండి:
- మిస్ యూనివర్స్ అందాల పోటీలు: ‘తనిఖీల పేరుతో మగవాళ్ల ముందు దుస్తులు విప్పించారు’
- నేను ‘బైసెక్సువల్’ అని నాకన్నా ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలిసింది?
- భారత్-పాకిస్తాన్ విభజన: ఆనాటి ఉద్రిక్త పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను విమానాలు ఎలా కాపాడాయంటే...
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఫుట్‌బాల్ స్టేడియంలో 22 మందిని బహిరంగంగా కొరడాలతో కొట్టారు... ఈ దేశంలో ఏం జరుగుతోంది?
- 'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



