జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ యత్నం: భారత రక్షణ శాఖ

ఫొటో సోర్స్, ANI
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జమ్మూ, ఉధంపుర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని.. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని 'ఎక్స్' వేదికగా తెలిపింది.
పాక్ క్షిపణులను తాము ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు, కశ్మీర్‌పై ఎలాంటి దాడులు చేయలేదంటూ పాకిస్తాన్ ఖండించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి బీబీసీకి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, ANI
జమ్మూ విమానాశ్రయానికి సమీపంలో 16 శకలాలు పడ్డాయని జమ్మూనగరంలోని గుజ్జర్ నగర్ వంతెన వద్ద ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.
అదే సమయంలో, విమానాశ్రయంలో పేలుళ్లు జరిగినట్లు భద్రతావర్గాలు ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపాయి.
సైరన్లు మోగడంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మార్కెట్లు మూతపడ్డాయని, జనం పరుగులు తీయడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు.
జమ్మూ, పఠాన్‌కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలను మిసైల్స్, డ్రోన్లతో పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుందని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్స్ వేదికగా తెలిపింది.
''ఎలాంటి నష్టం జరగలేదు. భారత సాయుధ దళాలు అడ్డుకుని, నాశనం చేశాయి'' అని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జమ్మూకశ్మీర్‌లో సైరన్లు మోగడంతో బ్లాక్‌అవుట్ అయిందని ప్రత్యక్షసాక్షి తెలిపారు.
జమ్మూలో రక్షణ వ్యవస్థలను(డిఫెన్స్ సిస్టమ్స్)ను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు బీబీసీకి తెలిపాయి. నగరమంతటా సైరన్లు మోగాయి.
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ దళాలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య చెబుతున్న వివరాల ప్రకారం.. జమ్మూలో అనేక చోట్ల ప్రజలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, నగరమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కఠువా ప్రజలకు రెండుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు.
కఠువా జమ్మూ నుంచి గంటన్నర ప్రయాణ దూరంలో ఉంటుంది. ప్రస్తుతం రెండు నగరాలు బ్లాక్‌అవుట్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, ANI
జమ్మూ డివిజన్‌లోని సాంబాలో బ్లాక్‌అవుట్ అమల్లో ఉందని, సైరన్లు వినిపిస్తున్నాయని తెలిపింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను అడ్డుకుంటున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.
చండీగఢ్‌లోనూ సైరన్లు మోగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఐపీఎల్ మ్యాచ్ రద్దు
ఇదే సమయంలో, ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ను నిర్వాహకులు మధ్యలో నిలిపివేశారు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను రద్దు చేసినట్లు క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది.
స్టేడియంలో సాంకేతిక కారణాలతో మ్యాచ్ రద్దయినట్లు జియో హాట్‌స్టార్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
భారత్‌లోని సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా లక్ష్యంగా పాకిస్తాన్ 8 మిసైల్స్ ప్రయోగించిందని, వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుని, నాశనం చేసినట్లు డీడీ న్యూస్ రిపోర్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడారని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
''ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలకు మా మద్దతు ఉంటుందన్నారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈయూ హెచ్ఆర్‌వీపీ(ఈయూ హై రెప్రజెంటేటివ్, యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్) కాయ కాల్లస్‌తో మాట్లాడినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
''తాజా పరిణామాలను ఈయూ హెచ్‌ఆర్‌వీపీ కాయ కాల్లస్‌తో చర్చించాం. ఏవైనా తీవ్ర పరిస్థితులు ఎదురైతే కచ్చితంగా బలమైన ప్రతిస్పందన ఉంటుంది'' అని అందులో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)