ఫిఫా వరల్డ్ కప్ 2022: ఖతార్‌లో ఘనంగా ఆరంభ వేడుకలు

ఒంటెలు, బాణసంచా, మోర్గాన్ ఫ్రీమాన్. ఇవీ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఆరంభ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్

ఆదివారం ఆతిథ్య ఖతార్ జట్టుకు, ఈక్వెడార్‌కు మధ్య జరిగిన 2022 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ తొలి మ్యాచ్‌కు ముందు అల్-బయత్ స్టేడియంలో అద్భుతమైన ప్రారంభ వేడుకలు జరిగాయి.

ఖతారీ యూట్యూబర్ ఘనిమ్ అల్-ముఫ్తాతో కలిసి అమెరికన్ నటుడు ఫ్రీమాన్ ఉత్సవాల్లో కనిపించారు.

కౌడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో జన్మించి అల్ ముఫ్తాతో కలిసి ఫ్రీమాన్ స్టేడియంలో కనిపిస్తారు.

ఆయన స్టేజి మీదకు రాగానే కరతాళ ధ్వనులు వినిపించాయి. ‘అందరికీ స్వాగతం’ అంటూ ఫ్రీమాన్ క్రీడాభిమానులను పలకరించారు.

టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు, ఆస్కార్ విజేత నటుడు ఫ్రీమాన్ ఒక వీడియో ద్వారా ఫుట్‌బాల్ ప్రాధాన్యతను, అది ప్రపంచాన్ని ఎలా ఏకం చేస్తుందన్న విషయాన్ని వివరిస్తారు.

దక్షిణ కొరియా పాప్ స్టార్ జంగ్ కూక్ అల్ ఖోర్‌లోని స్టేడియంలో ఖతారీ గాయకుడు ఫహద్ అల్ కుబైసీతో కలిసి డ్రీమర్స్ అనే టోర్నమెంట్ పాటను ఆలపించారు.

ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అరబిక్‌లో ప్రారంభ ప్రసంగం చేయడానికి ముందు జంగ్ కూక్, ఫహద్ అల్ కుబైసీలు స్టేజ్ మీద ప్రదర్శన నిర్వహించారు.

ఆరంభ వేడుకల్లో అద్భుతమైన డాన్స్ షో జరిగింది.

ఫిఫా కప్ ముందు నిప్పులతో ప్రదర్శన జరిగింది.

ఒక డాన్స్ ప్రదర్శనలో స్టేజి మీదకు ఒంటెలను తీసుకొచ్చారు.

అల్ -బయత్ స్టేడియంలో అద్బుతమైన బాణాసంచా ప్రదర్శన జరిగింది.

టోర్నమెంట్ మస్కట్ గాలిలో ఎగురుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)