'మీకు వద్దనుకుంటే, కొనకండి', అమెరికా ఆరోపణలకు జైశంకర్ స్పందన..

వీడియో క్యాప్షన్, ‘మీకు సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనకండి’ - జైశంకర్
'మీకు వద్దనుకుంటే, కొనకండి', అమెరికా ఆరోపణలకు జైశంకర్ స్పందన..

రష్యా నుంచి చమురు కొని భారత్ లాభాలు ఆర్జిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమాధానం ఇచ్చారు. ఎకనామిక్ టైమ్స్ 'వరల్డ్ లీడర్స్ ఫోరం 2025'లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ స్పందించారు.

''చూడండి, వాణిజ్యానికి మద్దతిచ్చే అమెరికా ప్రభుత్వం కోసం పనిచేసేవారు.. వాణిజ్యం చేస్తున్నారని ఇతరులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ఆశ్చర్యకరం.

కానీ, మీకు భారత్ నుంచి ఆయిల్ లేదా రిఫైన్డ్ ఉత్పత్తులు కొనడంలో ఏదైనా సమస్య ఉంటే, వాటిని కొనకండి. మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు.

కానీ, మీరు కొంటారు. అమెరికా కొనుగోలు చేస్తుంది. మీకు నచ్చకపోతే వాటిని కొనకండి'' అని ఆయన అన్నారు.

జైశంకర్, విదేశాంగ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)