గిట్టుబాటు ధరల కోసం దిల్లీలో రైతుల నిరసనలు...

వీడియో క్యాప్షన్, దిల్లీలో రైతుల ఆందోళన ఎందుకు జరుగుతోంది?
గిట్టుబాటు ధరల కోసం దిల్లీలో రైతుల నిరసనలు...

దిల్లీలో రైతులు మరోసారి గళమెత్తారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలివ్వాలని, వ్యవసాయంలో ఉపయోగించే సామగ్రిపై జీఎస్‌టీని తొలగించాలనే డిమాండ్లతో భారతీయ కిసాన్ సంఘ్ నేతృత్వంలో రామలీలా మైదాన్‌లో ప్రదర్శన జరిగింది.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని, ఎన్నికలకు దూరంగా ఉంటామని రైతు నేతలు హెచ్చరిక స్వరంతో ప్రకటించారు.

అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా పని చేస్తుంది భారతీయ కిసాన్ సంఘ్.

రెండేళ్ల కింద మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఉద్యమం నడిపిన సంయుక్త్ కిసాన్ మోర్చా ఈ ర్యాలీకి దూరంగా ఉంది.

బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందిస్తున్న రిపోర్ట్.

రైతుల ఆందోళన

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)