You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజాలో ఆకలి బాధ.. 6 ఫోటోలలో..
గాజాలో ప్రజలు ఆహార కొరతతో అల్లాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
దాదాపు గాజా ప్రజలు మొత్తం చెల్లాచెదురయ్యారని, ఇజ్రాయెల్ కాల్పుల పరిధిలోకి రాని భూభూగం 12 శాతం కన్నా తక్కువ ఉందని, ప్రజలంతా అక్కడే ఉండడంతో సహాయ కార్యకలాపాలు అసాధ్యంగా మారాయని మానవతా సంస్థలు తెలిపాయి.
గాజాలో ప్రతిరోజూ సగటున 28 లారీ లోడ్‌ల సాయం మాత్రమే పంపిణీ జరుగుతోందని, ఇజ్రాయెల్ నిర్బంధం వల్ల గాజా బయట, వేర్‌హౌసులతో పాటు గాజాలోపల కూడా టన్నుల కొద్దీ ఆహారం, పరిశుభ్రమైన నీళ్లు, ఔషధాలు, ఇంధనం ఉండిపోతున్నాయని సంస్థలు తెలిపాయి.
మూడు రోజుల నుంచి ఆహారం దొరకడం లేదని ఖాన్ యూనస్ నగరంలోని నసీర్ ఆస్పత్రిలో పిల్లల చికిత్స విభాగం అధిపతి డాక్టర్ అహ్మద్ అల్ ఫరా బీబీసీతో చెప్పారు.
గాజాలో ఆకలిని సృష్టిస్తున్నారనే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విమర్శలకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చర్యలు ప్రారంభించింది.
ఈ చర్యలు "మానవతా ప్రతిస్పందనను మెరుగుపరచడానికి" ఉద్దేశించినవని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది.
ఇజ్రాయెల్ ఇప్పుడు ఆకాశం నుంచి సహాయాన్ని వదలడానికి అనుమతిస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , జోర్డాన్ ప్రజలకు ఆహారం, ఇతర సహాయాన్ని విమానాల ద్వారా పంపుతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి.
కొన్ని ప్రాంతాలలో "సైనిక కార్యకలాపాలలో వ్యూహాత్మక విరామం" తీసుకుంటామని ఐడీఎఫ్ తెలిపింది. సహాయం కోసం ప్రత్యేక మార్గాలను సృష్టిస్తామని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)