యుక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికాలో ‘రెడ్ కార్పెట్’ స్వాగతం

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు సాయం చేయడం అంటే చారిటీ కాదు, భద్రతకు పెట్టుబడి అన్న జెలియెన్‌స్కీ
యుక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికాలో ‘రెడ్ కార్పెట్’ స్వాగతం

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలియన్‌స్కీకి అమెరికాలో రెడ్ కార్పెట్ వంటి స్వాగతం లభించింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను వైట్ హౌజ్‌లో భేటీ అయ్యేందుకు వెళ్లిన జెలియన్‌స్కీ, నాటకీయంగా యుద్ధభూమి నుంచి అమెరికాకు విమాన ప్రయాణం చేశారు.

ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలయ్యాక జెలియన్‌స్కీ చేసిన మొదటి విదేశీ పర్యటన ఇదే. యుక్రెయిన్‌కు అమెరికా అత్యంత కీలక మిత్రదేశం.

ఇరువురి భేటీ సందర్భంగా, జో బైడెన్ మాట్లాడుతూ – ఎంత కాలమైనా సరే యుక్రెయిన్‌కు తోడుగా అమెరికా నిలుస్తుందన్నారు. మరో 185 కోట్ల డాలర్ల మిలిటరీ సాయాన్ని అందిస్తామనే హామీ ఇచ్చారు.

బీబీసీ ప్రతినిధి నదా తౌఫిక్ అందిస్తోన్న రిపోర్ట్.

వొలొదిమిర్ జెలియన్ స్కీ, జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)