ఇరాన్: ఆందోళనకారులను బహిరంగంగా ఉరితీస్తున్న ప్రభుత్వం
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులను బహిరంగంగా ఉరితీస్తున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టులు 20 మందికి ఉరిశిక్ష విధించాయి.
మరణశిక్ష విధించగల నేరమైన దైవ వ్యతిరేకత అనే అభియోగాన్ని వారి మీద మోపారు.
నవంబర్‌లో అరెస్టైన మజిద్‌రెజా రహ్నావర్ద్‌ను సోమవారం ఉదయం బహిరంగంగా ఉరితీశారు. దేశాధ్యక్షుడికి నిబద్దులైన ఇద్దరు పోలీసుల్ని రహ్నావర్ద్‌ను చంపారనే అభియోగం రుజువు కావడంతో శిక్ష విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విచారణలో కనీస ప్రాథమిక ప్రమాణాలు పాటించలేదని మానవహక్కుల సంఘాలు అంటున్నాయి. గత మూడు నెలల్లో గాయాలపాలైన అనేకమంది నిరసనకారులను ఆసుపత్రి బెడ్లపై ఉండగానే అరెస్ట్ చేశారు.
ఇటీవల నిరసనల్లో తీవ్ర గాయాలపాలై ఇరాన్ నుంచి అతికష్టం మీద బయటపడ్డ ఇద్దరు నిరసనకారులతో మాట్లాడారు బీబీసీ ప్రతినిధి జియర్ గోల్.
ఇవి కూడా చదవండి:
- వహాయ: ఐదో భార్య పేరుతో సెక్స్ బానిసలుగా బాలికలు.. ప్రభుత్వం నిషేధించేవరకు పోరాడిన మహిళ
- 100 రోజుల భారత్ జోడో యాత్ర: రాహుల్ గాంధీపై జోకులు తగ్గడానికి ఈ యాత్రే కారణమా? ప్రజలు మారిపోతున్నారా?
- చైనాలో మందుల కోసం ఎగబడుతున్న జనం.. అసలేం జరుగుతోంది?
- సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మంత్రిత్వ శాఖను రద్దు.. అధ్యక్షుడి నిర్ణయంపై మహిళల ఆగ్రహం
- అవతార్ 2 రివ్యూ: ‘మన’ అనుకున్నది ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తామో అదే అవతార్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



