గడ్డితో కరెంట్.. పంజాబ్‌లో ఏకంగా ఫ్యాక్టరీకే సప్లయ్ చేస్తున్నారు
పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.
పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ సూచనలు, మద్దతు లేకపోవడంతో వాటికి నిప్పు పెట్టడం తప్ప మరో మార్గం లేదంటున్నారు.
దీని వల్ల దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది.
ఓ వైపు పంట వ్యర్థాలకు నిప్పుపెడుతున్న వారిని.. మరో వైపు అదే పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్న వారిని కలిశారు బీబీసీ ప్రతినిధి సరబ్‌జిత్ ధాలివాల్.
పంజాబ్ ఫతేఘర్ జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమ పంట వ్యర్థాలను..విద్యుదుత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తోంది. ఇది కాలుష్యం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ పంట వ్యర్థాలను అమ్మడం ద్వారా రైతులు కూడా లాభపడుతున్నారు.
‘పంటవ్యర్థాలు ఓ రకమైన ఇంధనం . చౌకైన ఇంధనం. దీని ప్రాధాన్యత చాలా మందికి తెలీదు.. దీంతో సులభంగా విద్యుదుత్పత్తి చేయచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మేం ప్రయత్నించాం... విజయం సాధించాం. ముందుగా ఈ వ్యర్థాలన్నీ బాయిలర్‌లో వేస్తాం. బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటిఆవిరి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్తును ఉపయోగించి మేం మా ఫ్యాక్టరీని నడిపిస్తున్నాం’ అని చెప్పారు గణేష్ ఎడిబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హన్స్‌రాజ్ గార్గ్.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ది గ్రేట్ మూన్ హోక్స్: ‘చంద్రుని మీద మనుషులు, 420 కోట్ల జీవులు’.. వారికి బైబిల్ బోధించాలని 187 ఏళ్ల కిందట క్రైస్తవ మిషనరీలు నిధులు సేకరించినప్పుడు..
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? దీనికి వైద్యులు చెబుతున్న కారణాలేంటి?
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- 6 వందల కోట్లు, 7 వందల కోట్లకు చేరినప్పుడు పుట్టిన బేబీలను కలిసిన బీబీసీ బృందం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




