You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘గోల్ఫ్’ బంతి ధర రూ. 52 లక్షలు, దాని ప్రత్యేకత ఏంటంటే?
- రచయిత, ఎయిఫె వాల్ష్
- హోదా, బీబీసీ న్యూస్
ఒక గోల్ఫ్ బంతి ధర అక్షరాలా రూ. 52,39,61 (64,000 డాలర్లు) పలికింది.
దాని ప్రత్యేకత ఏంటంటే, దిగ్గజ క్రీడాకారుడు టైగర్ వుడ్స్‌కు మొదటి మేజర్ టోర్నీ టైటిల్ లభించింది ఈ బంతితోనే.
1997 మాస్టర్స్ టోర్నీలో దిగ్గజ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ ఈ బంతితో ఆడాడు.
అందులో విజేతగా నిలిచిన టైగర్ వుడ్స్, కెరీర్‌లో తొలి మేజర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్నాడు. అంతేకాకుండా ‘‘మాస్టర్స్’’ టైటిల్‌ను గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
రికార్డులు కొల్లగొట్టే వుడ్స్ అద్భుత గోల్ఫ్ ప్రయాణానికి ఈ విజయమే నాందిగా నిలిచింది.
ఆ టోర్నీలో నాలుగు రోజుల్లో వుడ్స్ చేసిన స్కోరు 270. ఇది ‘పర్’ స్కోరుకు 18 పాయింట్లు తక్కువ. ‘’18 అండర్ పర్’’ స్కోరుతో గెలుపొందిన వుడ్స్, గతంలో జేక్ నిక్‌లస్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట తిరగరాశాడు.
అయితే, ఈ టోర్నీలో తుది రౌండ్ ముగిసిన తర్వాత ఒక 9 ఏళ్ల బాలుడికి టైగర్ వుడ్స్ ఆ బంతిని ఇచ్చేశారు.
తుది రౌండ్‌లో భాగంగా అయిదో హోల్ వద్ద ‘బోగీ’ సాధించిన తర్వాత టైగర్ వుడ్స్ ఆ బంతిని జులియాన్ నెక్స్‌సెన్ అనే బాలుడికి ఇచ్చారు.
మార్చి 27వ తేదీన ఈ బంతిని వేలంలో పెట్టారు. 500 డాలర్ల ప్రారంభ ధరతో ఇది వేలానికి వచ్చింది. ఆదివారం వేలం ముగిసే సమయానికి దీనికి 64,124డాలర్ల ధర పలికింది.
ఆ టోర్నీ చివరి రౌండ్‌లో వాడిన బంతుల్లో అందరికీ తెలిసిన బంతి ఇదేనని వేలం నిర్వహించిన గోల్డెన్ ఏజ్ యాక్షన్స్ సంస్థ వ్యాఖ్యానించింది.
వుడ్స్ ఆ బంతిని నెక్స్‌సెన్‌కు ఇవ్వడాన్ని వాషింగ్టన్ టైమ్స్‌కు చెందిన ఒక రిపోర్టర్‌తో పాటు డజన్ల కొద్ది ప్రజలు చూశారని వేలం నిర్వాహకులు చెప్పారు.
నెక్స్‌సెన్‌కు వుడ్స్ బంతిని ఇచ్చిన ఘటన గురించి మరుసటి రోజు వాషింగ్టన్ పోస్ట్ మొదటి పేజీలో వార్తను రాసింది.
‘‘నిన్న 36 హోల్స్ రౌండ్‌లో తొలి బోగీ నమోదు చేసిన తర్వాత ఆ బంతిని గ్రీన్‌విల్లేకు చెందిన 9 ఏళ్ల జులియన్ నెక్స్‌సెన్‌కు ఇచ్చారు’’ అని వాషింగ్టన్ పోస్ట్ వార్తలో పేర్కొంది.
వాషింగ్టన్ పోస్ట్ పేపర్ కటింగ్‌తోపాటు నెక్స్‌సెన్ బ్యాడ్జ్, టోర్నీ పెయిరింగ్ షీట్స్, ఫైనల్ రౌండ్ మ్యాప్, గోల్ప్ బంతిని ఒకే ఫ్రేమ్‌లో భద్రంగా ఉంచారు.
గోల్ఫ్ బంతి ప్రామాణికతను, ఫైనల్ రౌండ్ తర్వాత వుడ్స్‌తో తను మాట్లాడిన సమయాన్ని ధ్రువీకరిస్తూ నెక్స్‌సెన్ ఒక లీగల్ పేపర్‌పై సంతకం చేశారు.
ఇది జరిగి 26 ఏళ్లు గడిచింది. ఇప్పటికీ వుడ్స్ ఇంకా గోల్ఫ్ ఆడుతూనే ఉన్నాడు. గాయం కారణంగా తాజా మాస్టర్స్ టోర్నీ నుంచి ఆదివారం వుడ్స్ వైదొలిగాడు.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)