గల్లీ ఎరోజన్: ఊళ్లను మింగేస్తున్న అగాధాలు..

వీడియో క్యాప్షన్, పర్యావరణ మార్పుల కారణంగా ఊళ్లను మింగేస్తున్న అగాధాలు..
గల్లీ ఎరోజన్: ఊళ్లను మింగేస్తున్న అగాధాలు..

దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకూ అనేక పట్టణాలు, నివాస ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. కొత్తగా పుట్టుకొస్తున్న లోయలు ఇళ్లను మింగేస్తున్నాయి. వీధులను చీలుస్తున్నాయి.

ఈ పరిస్థితికి కారణం గల్లీ ఎరోజన్. అంటే పరిసర నీటి ప్రవాహం తీవ్రమై భూమి కోతకు గురవడం. ఈ కోతల్లో అనేక నివాస ప్రాంతాలు కూలిపోయి మాయమైపోవడం.

ఈ అసాధారణ క్రమం వేగంగా వ్యాపిస్తోంది.

దీనికి అడవుల నరకివేత, అదుపు లేని పట్టణీకరణ, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తోడవుతున్నాయి.

వాతావరణ మార్పులే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి: