You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంగారెడ్డి ఎస్‌బీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో బుధవారం రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు గుర్తించామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్, బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డతో చెప్పారు.
మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవి వర్మ ఉన్నారని ఎస్పీ తెలిపారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయని ఆయన చెప్పారు.
రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగిందని, పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ చెప్పారు.
ఘటనా స్థలం నుంచి నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఫైర్ ఆఫీసర్ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో చెప్పారు.
రియాక్టర్ పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పరిశ్రమలో మరో రియాక్టర్ కూడా ఉండటంతో, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ పరిశ్రమ పరిసరాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
సహాయ చర్యలు వేగవంతం చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)