అమెరికా చరిత్రలో క్రిమినల్ నేరవిచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడు

డోనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదుచేసేందుకు ‘‘న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ’’ ఇటీవల పచ్చజెండా ఊపింది.

దీంతో తన పేరుపై క్రిమినల్ అభియోగం నమోదవుతున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన కాబోతున్నారు.

ఇంతకీ ఆయనపై నిర్దిష్టంగా ఎలాంటి అభియోగాలు చేస్తారో బయటకు తెలియడం లేదు.

డిస్ట్రిక్ట్ అటార్నీ నమోదుచేసిన అభియోగపత్రాలు ప్రస్తుతం సీల్‌చేసి ఉన్నాయి. మంగళవారం వీటిని అధికారికంగా బయటకు విడుదల చేస్తారు.

అయితే, ఈ కేసు 2016లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఓ అడల్ట్ ఫిల్మ్ స్టార్‌కు చెల్లింపుల సంబంధించినది. ఆయనతోనున్న సంబంధంపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ఆ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)