భోపాల్ గ్యాస్ విషాదం: వేలాదిమంది చనిపోయిన 40 ఏళ్ల నాటి దుర్ఘటన చిత్రాలలో..

భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి నలభై సంవత్సరాలు. ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఘోర విపత్తులలో ఇదొకటి.

భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి విషవాయువు లీకైంది. ఆ గ్యాస్ నగరం అంతటా వ్యాపించింది. దాని ప్రభావంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో చాలామంది ఎక్కడి వారక్కడే కూలిపోయారు.

వేలాది మంది చనిపోయారు, దాదాపు 5 లక్షల మంది విషవాయువుల బారిన పడ్డారు. ఘటన తర్వాత భోపాల్ నగరమంతా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వ నివేదికల ప్రకారం.. గ్యాస్ లీకైన రోజుల వ్యవధిలోనే సుమారు 3,500 మంది మరణించారు. ఆ తర్వాత సంవత్సరాలలో 15,000 మందికి పైగా మరణించారు.

మరణాల సంఖ్య, బాధితుల విషయంలో కచ్చితత్వం లేదని సామాజిక వేత్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, చాలామంది బాధితులు ఇప్పటికీ ఆ విష వాయువు ప్రభావాలతో బాధపడుతున్నారు.

ప్లాంట్‌లోని ఏడుగురు మాజీ మేనేజర్లను 2010లో కోర్టు దోషులుగా నిర్ధరించింది. అయితే, వారికి కొద్దిపాటి జరిమానాలు, స్వల్పకాలిక జైలు శిక్షలు విధించింది. కానీ, విపత్తు చాలా పెద్దదని, బాధితులకు సరైన న్యాయం జరగలేదని పలు సంఘాలు వాదించాయి.

అమెరికాకు చెందిన ఈ యూనియన్ కార్బైడ్‌ కంపెనీని 1999లో డౌ కెమికల్స్ కొనుగోలు చేసింది.

(కొన్నిచిత్రాలు మిమ్మల్ని కలిచివేయచ్చు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)