ద‌ళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.50 ల‌క్ష‌ల కానుక, ఏంటీ పథకం?

వీడియో క్యాప్షన్, దళితులు కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. 2.5 లక్షలు ఇస్తుందని మీకు తెలుసా?
ద‌ళితులు కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.50 ల‌క్ష‌ల కానుక, ఏంటీ పథకం?

ద‌ళితులు ఇతర కులాలకు చెందిన వారిని వివాహం చేసుకుంటే అలాంటి జంటలకు కేంద్ర ప్ర‌భుత్వం 2.50 ల‌క్ష‌ల రూపాయ‌ల పెళ్లి కానుక ఇచ్చి వారిని ప్రోత్స‌హించే ప‌థ‌క‌మే ‘డాక్ట‌ర్ అంబేడ్కర్ స్కీమ్ ఫ‌ర్ సోష‌ల్ ఇంటిగ్రేష‌న్ త్రూ ఇంట‌ర్ క్యాస్ట్ మేరేజెస్’.

సామాజిక అస‌మాన‌త‌లు రూపుమాపే లక్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం 2013లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించింది.

దీనికోసం కేంద్రం ప్ర‌త్యేకించి ‘అంబేడ్కర్ ఫౌండేష‌న్’ను స్థాపించి దీని ద్వారా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది.

దళితుల పెళ్ళి పథకం

ఫొటో సోర్స్, Getty Images

పేద కుటుంబాల‌కు చెందిన ద‌ళితులు కులాంత‌ర వివాహం చేసుకున్న స‌మ‌యాల్లో వారికి ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థికంగా ల‌బ్ధి చేకూరుతుంది.

ఈ ప‌థ‌కం వివ‌రాలు ఏమిటి? దీనికి అర్హులెవరు? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి? ఈ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సహాయం అందుకోవడం ఎలా? నియమ నిబంధనలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)