అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్

వీడియో క్యాప్షన్, అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ అరెస్ట్
అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్

తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో అయ్యప్ప స్వామి పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ దగ్గర్లో అతణ్ణి అరెస్ట్ చేసినట్టు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు తెలిపారు.

అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతంపై నరేశ్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు, ఇతర హిందూ సంఘాల వారూ తీవ్రంగా స్పందించారు.

తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యల ఫిర్యాదులు దాఖలు చేశారు అయ్యప్ప భక్తులు. కనీసం వందకు తగ్గకుండా ఫిర్యాదులు నరేశ్‌పై అందినట్టు తెలుస్తోంది.

రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. నరేశ్ మాట్లాడిన సభా వేదికపై బీఎస్పీ నాయకులు కూడా ఉన్నారు.

అయితే, నరేశ్‌కి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీఎస్పీ తెలంగాణ విభాగం ప్రకటించింది.

మత విద్వేషాలను రెచ్చగొట్టిన నేరం కింద అతనిపై కేసు నమోదు చేశారు.

బైరి నరేశ్ అరెస్ట్
ఫొటో క్యాప్షన్, రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని ఫిర్యాదు చేసిన భక్తులు

ఇవి కూడా చదవండి