పాకిస్తాన్: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతే వరద బీభత్సానికి కారణమా?

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ వరద బీభత్సానికి పర్యావరణ మార్పులే కారణమంటోన్న ప్రభుత్వం
పాకిస్తాన్: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతే వరద బీభత్సానికి కారణమా?

పాకిస్తాన్‌లో ఇటీవలి వరదలకు దారుణంగా నష్టపోయిన రెండో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్.

దేశంలోని ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో జలాశయాలు, ఆనకట్టలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఈ ఆనకట్టలు తెగిపోవడం వల్లనే భారీ నష్టం జరిగినట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

ఆనకట్టలు తెగడంతో వరద నీరు పొంగి ప్రజల ప్రాణాలు తీయడంతో పాటు , భారీగా ఆస్తి నష్టం, పంటనష్టం జరిగింది.

ఈ విధ్వంసానికి కారణం పర్యావరణ మార్పులే అంటోంది ప్రభుత్వం.

అయితే ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి, నాసిరకం నిర్మాణ సామగ్రి వల్లే ఇదంతా జరిగినట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

దేశంలో అత్యధిక ఆనకట్టలు ఇక్కడే ఉన్నాయని బలూచిస్తాన్‌లోని పాకిస్తాన్ ఫ్లడ్ కమిషన్ చెబుతోంది.

దాదాపుగా 150 భారీ ఆనకట్టలు, 464 చిన్న జలాశయాలున్నాయి.

మొత్తం 23 జిల్లాల్లోని 169 ఆనకట్టలు వర్షాలకు దెబ్బతిన్నాయన్న విషయం బీబీసీ పరిశోధనలో బయట పడింది.

కొన్ని జిల్లాల్లో – ఆనకట్టలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.

వాటిలో ఒకటి పిషిన్ ప్రాంతంలోని టోబా కాక్రిలో ఉన్న సెర్గెయ్ ఘేజ్ డ్యాం. ఈ ఆనకట్ట తెగడంతో పోటెత్తిన వరద తన మార్గంలో అడ్డొచ్చిన అన్నిటినీ నీట ముంచేసింది.

కరవు పీడిత ప్రాంతంలో నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతోనే బలూచిస్తాన్‌లో ఆనకట్టలు ఎక్కువగా నిర్మించారు. ఈ రిజర్వాయర్లలో వర్షపు నీటిని నిల్వ చేయవచ్చని భావించారు.

బలూచిస్తాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో నష్టాలకు కారణం అవినీతి, సాంకేతిక లోపాలు, పర్యావరణ మార్పులు. ఈ వరదలు వ్యవస్థలోని బలహీనతల్ని ఎత్తి చూపాయి.

వ్యవస్థలో బలహీనతలకు అడ్డుకట్ట వెయ్యకపోతే.. వరద ముప్పు పొంచి ఉన్న దేశంలో భవిష్యత్‌లో వచ్చే ప్రమాదాల తీవ్రత రెట్టింపు స్థాయిలో ఉండవచ్చు.

పాకిస్తాన్ ఆనకట్టల్లో అవినీతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)