ధన్యవాదాలు
ఇక్కడిలో లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
మహిళలకు ప్రవేశం లేదంటూ దిల్లీలోని జామా మసీదు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమైంది. దీని మీద దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవాల్, జామా మసీద్ ఇమామ్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇక్కడిలో లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ttd
తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం నిర్వహించిన తలనీలాల ఈ-వేలం పాటలో 21,100 కిలోల జుట్టుకు రూ. 47.92 కోట్లు వచ్చాయని టీటీడీ ప్రకటించింది.
అన్ని రకాల జుట్టునూ వేలం వేశామని టీటీడీ వెల్లడించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తరణకు రూ.573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఎన్‌హెచ్-163లోని హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్ విస్తరణ ప్రాజెక్ట్ విలువ రూ.136.22 కోట్లు.
‘ఈ రోడ్డు విస్తరణ వల్ల లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది. అలాగే ములుగు జిల్లాలో లెఫ్ట్ వింగ్ ఎక్ట్సీమిజం ఎక్కువ. దాన్ని నియంత్రణలో ఉంచేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది’ అని గడ్కరీ అన్నారు.
ఎన్‌హెచ్-167కేలో తెలంగాణలోని నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది మీద వంతెన కోసం చేపట్టే ప్రాజెక్ట్ విలువ రూ.436.91 కోట్లు.
వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా ఉన్నా నంద్యాలకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని గడ్కరీ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హరియాణాలో ఎన్‌హెచ్-148బీలో భివానీ-హాన్సీ సెక్షన్‌ను రూ.1,322.13 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించే ప్రాజెక్ట్‌ను కూడా ఆమోదించినట్లు గడ్కరీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
మహిళలకు ప్రవేశం లేదంటూ దిల్లీలోని జామా మసీదు ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమైంది.
దీని మీద దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలీవాల్, జామా మసీద్ ఇమామ్‌కు నోటీసులు జారీ చేశారు.
‘జామా మసీదులోకి మహిళలను రానివ్వకుండా నిషేధించడం తప్పు. ప్రార్థనలు చేసుకునే హక్కు మగవారికి ఎంత ఉంటుందో ఆడవారికి కూడా అంతే ఉంటుంది. దీని మీద జామా మసీదు ఇమామ్‌కు నోటీసులు జారీ చేస్తున్నాను. మహిళలను ఇలా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే తాము ఒంటరి మహిళలను మాత్రమే నిషేధించామని జామా మసీద్ పీఆర్‌ఓ సాబియుల్లా ఖాన్ అన్నారు.
‘మేం మహిళలందరినీ నిషేధించలేదు. ఒంటరి మహిళలకు మాత్రమే ప్రవేశాన్ని నిలిపివేశాం. ఒంటరిగా వచ్చే వాళ్లు ఇక్కడ తప్పుడు పద్ధతిలో నడుచుకుంటున్నారు. అబ్బాయిలతో తిరుగుతున్నారు. టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటున్నారు.
ఫ్యామిలీతో వచ్చే వాళ్లకు, భర్తతో కలిసి వచ్చే వాళ్లకు ఎటువంటి నిషేధం లేదు.
అబ్బాయిలను కలవడానికి రావడం, దీన్ని పార్క్‌గా భావించడం, డ్యాన్సులు చేయడం వంటివి వాటిని మందిరం, మసీదు, గురుద్వారా వంటి ఎటువంటి ధార్మిక స్థలంలోనూ అనుమతించరు.
ప్రార్థనలు చేసుకోవడానికి వచ్చే మహిళల మీద ఎటువంటి నిషేధం లేదు’ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఇప్పటంలో ‘అక్రమ నిర్మాణాల’ తొలగింపు మీద కోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు లక్ష రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ హై కోర్టు జరిమాన విధించింది.
అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా... ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి పిటిషనర్లు స్టే తెచ్చుకున్నారనేది ఆరోపణ.
కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయించినందుకు 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించారు.

ఫొటో సోర్స్, Facebook/Ch Malla Reddy
తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి కుమారుడు భద్రా రెడ్డి, ఆదాయపన్ను విభాగం అధికారి రత్నాకర్ మీద కేసు పెట్టారు.
తన సోదరుడి చేత బలవంతంగా సంతకాలు చేయించారంటూ ఆయన బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐపీసీ సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసినట్లు బోయినపల్లి ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్ తెలిపారు.
మరొకవైపు ఆదాయపన్ను విభాగం అధికారి రత్నాకర్ కూడా మంత్రి మల్లారెడ్డి మీద కేసు పెట్టారు.
తన దగ్గర నుంచి ఐటీ అధికారులు సేకరించిన ఆధారాలు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను బలవంతంగా లాక్కున్నారని బోయినపల్లి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, ISPR
పాకిస్తాన్ కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ నియమితులయ్యారు.
ఈమేరకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీమ్‌ను ప్రకటించారు. ఈమేరకు మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది.
దాంతో సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, Facebook/Kakani Govardhan Reddy
నెల్లూరు జిల్లా కోర్టులో చోరీ ఘటన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు ఇతర కేసుల పత్రాలు చోరికి గురయ్యాయని ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టు సిబ్బంది తెలిపారు.
ప్రస్తుతం ఆ కేసు మీద ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణ జరుగుతోంది.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.
ఆ కేసును హై కోర్టు సుమోటోగా తీసుకుంది. ఆ ఘటన మీద నెల్లూరు జిల్లా న్యాయమూర్తి హై కోర్టుకు నివేదిక సమర్పించారు.

ఫొటో సోర్స్, kipgodi
మహారాష్ట్రలోని ముంబయిలో మశూచి కేసులతో ఈ ఏడాది ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్లు బీఎంసీ తెలిపింది.
ఇప్పటి వరకు 233 కేసులు నమోదయ్యాయి.
ఒక్క బుధవారమే సుమారు 30 కేసులు నమోదు కాగా 22 మందిని అదే రోజు సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించినట్లు బీఎంసీ వెల్లడించింది.
కర్నాటకలో ‘హిందూ జాగరణ్ వేదికే’ పెట్టిన పోస్టర్ ఒకటి చర్చనీయాంశమైంది.
దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రమణ్య టెంపుల్ నిర్వహించే ‘చంపా షష్ఠి’ వేడుకల్లో హిందువులు మాత్రమే స్టాల్స్ పెట్టాలని బ్యానర్ పెట్టింది.
ఇతర మతాల వారు షాపులు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లుగా అందులో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Raghu Rama Krishna Raju
తెలంగాణ ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది.
క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌లోని సెక్షన్ 41-ఎ కింద ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియలేదు.

ఫొటో సోర్స్, Instagram/iKamalHaasan
ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు ఆరోగ్యం బాగాలేనట్లు వార్తలు వచ్చాయి.
జ్వరం రావడంతో అస్వస్థతకు గురికావడం వల్ల ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
అయితే సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా కమల్ హాసన్ తమ ఆసుపత్రిలో చేరారని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్(ఎస్ఆర్ఎంసీ) తెలిపినట్లుగా వార్తా సంస్థ ‘ది హిందూ’ రిపోర్ట్ చేసింది.
68ఏళ్ల కమల్ హాసన్ బుధవారం హైదరాబాద్‌లో సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిశారు. ఆ తరువాత రెగ్యులర్ చెకప్‌లో భాగంగా ఎస్ఆర్ఎంసీకి వెళ్లగా అక్కడే ఆయనకు జ్వరం వచ్చినట్లు కథనాలు వచ్చాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.