ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్డేట్లు ముగిశాయి.
నగరంలోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, ఇతర ప్రదేశాల్లోనూ పేలుళ్లు నమోదయ్యాయని కీయెవ్ మేయర్ ప్రకటించారు.
ఈ పేజీలో లైవ్ అప్డేట్లు ముగిశాయి.

ఫొటో సోర్స్, facebook/rudraraju.gidugu
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ఏపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలు నియమితులయ్యారు.
ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్‌గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డి నియమితులయ్యారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఊమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిస్టొఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పళ్లం రాజు, చింతామోహన్, సుబ్బరామిరెడ్డి, జేడీశీలం, జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
రాజధాని కీయెవ్ సహా యుక్రెయిన్‌లోని పలు నగరాలు, పట్టణాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి.
దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి.
పొరుగునే ఉన్న మాల్డోవా దేశంపైన కూడా ఈ ప్రభావం పడింది. అక్కడ కూడా భారీగా కరెంటు కోతలు ఏర్పడ్డాయి.

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌పై మళ్లీ దాడులు జరుగుతున్నాయి.
నగరంలోని మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, ఇతర ప్రదేశాల్లోనూ పేలుళ్లు నమోదయ్యాయని కీయెవ్ మేయర్ ప్రకటించారు.
నగరంలోని ప్రజలంతా షెల్టర్లలో దాక్కోవాలని సూచించారు.
భారత్‌లో తయారు చేసే విదేశీ మద్యం మీద 4శాతం పన్ను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒకప్పుడు జీడితొక్కును రోడ్లపై, డంపింగ్ యార్డుల్లో పారేసేవారు. ఇప్పుడు వాటితో ఆయిల్ తీస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తోంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అమెరికాలోని వర్జీనియాలో గల వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో సాయుధుడితో సహా ఏడుగురు మాత్రమే మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇంతకు ముందు సుమారు 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Social Media
చైనాలో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌లో నిరసనలు చెలరేగాయి.
వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో మార్చ్ చేస్తున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘మా హక్కులను రక్షించుకుంటాం’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. కొందరు సీసీ కెమెరాలు, కిటికీలను ధ్వంసం చేశారు.
తమకు పెట్టే తిండి సరిగ్గా లేదని అలాగే హామీ ఇచ్చినట్లుగా బోనస్ చెల్లించడం లేదని కూడా వారు నిరసన వ్యక్తం చేశారు.
గత నెలలో కోవిడ్-19 కేసుల వల్ల ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీని లాక్‌డౌన్ చేసింది. దాంతో కొందరు వర్కర్లు కంపెనీ వీడి ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆ తరువాత కొత్త వర్కర్లను కంపెనీ నియమించుకుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శ్రీకాకుళంలో నిర్వహించిన సభకు భద్రత కోసం వచ్చిన అప్పారావు అనే కానిస్టేబుల్ మృతి చెందారు.
ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో అప్పారావుకు అక్కడే ఉన్న 108లో ఆరోగ్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు.
ఆ తరువాత పోలీసు జీపులో సమీంలోని ఆసుపత్రికి కానిస్టేబుల్‌ను తీసుకెళ్లారు. అక్కడే అప్పారావు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.
అనకాపల్లి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా అప్పారావు పని చేస్తున్నారు.
పోలీసులు, 108 సిబ్బంది మధ్య వాగ్వాదం
అస్వస్థతకు గురైన అప్పారావును 108 వాహనంలో ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటూ ఆరోగ్యసిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.
అయితే తమను ఇక్కడే విధులు కేటాయించారు కాబట్టి తాము సభ వద్దే ఉండాలని 108 సిబ్బంది తెలిపారు.
ఈ విషయంలో పోలీసులు, 108 సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది.

ఫొటో సోర్స్, AFP
వాల్‌మార్ట్ కాల్పుల ఘటనలో మేనేజర్ తన సహ ఉద్యోగుల మీద కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
‘నేను బయటకు వచ్చిన వెంటనే మేనేజర్ స్టాఫ్ రూపంలోకి వెళ్లారు. ఆ తరువాత తుపాకీతో కాల్చడం ప్రారంభించారు. మా సహ ఉద్యోగులు కొందరు మరణించడం బాధాకరం’ అంటూ వాల్‌మార్ట్ యూనిఫాం ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.
20 ఏళ్ల తన సోదరుడు డ్యూటీకి వెళ్లిన 10 నిమిషాల్లోనే కాల్పుల్లో చనిపోయినట్లు వేయి-టీవీకి ఒక మహిళ వెల్లడించారు.
జెరూసలెంలోని రెండు బస్ స్టాప్‌ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఘటనలో 12 మంది గాయపడినట్లు వార్తా సంస్థ అల్‌జజీరా తెలిపింది. ఒకరు చనిపోయినట్లు ఏఎఫ్‌పీ ట్వీట్ చేసింది.
ఇజ్రాయెల్ బలగాల చేతిలో 16ఏళ్ల పాలెస్తీనా బాలుడు చనిపోయాడని అక్కడి అధికారులు ఆరోపించిన కొన్ని గంటల తరువాత ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికాలోని వర్జీనియాలో గల వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 10 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
‘వాల్‌మార్ట్‌కు చెందిన మేనేజర్ ఒకరు కాల్పులు జరిపారు’ అని వార్తా సంస్థ డెయిలీ మెయిల్ తెలిపింది.
ఈ ఘటనలో సుమారు 10 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది