పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే.. అవి ఉగ్రవాదం, పీవోకేపైనే: ప్రధాని మోదీ

భారత్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Narendra Modi/YT

భారత్ - పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు - కాల్పుల విరమణ తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి తర్వాత దేశం మొత్తం, ప్రతి రాజకీయ పార్టీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు.

"ఉగ్రవాదులను తుడిచిపెట్టేందుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మన సోదరీమణులు, కుమార్తెల నుదిటి నుంచి సింధూరం తొలగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికీ, ప్రతి ఉగ్రవాద సంస్థకీ తెలిసొచ్చింది."

"ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేపట్టిన సైనిక చర్య ప్రస్తుతానికి వాయిదా పడింది" అని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం హెడ్ పవన్ ఖేరా వార్తా సంస్థ ఏఎన్‌తో మాట్లాడుతూ, ''ప్రధాని మోదీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన షాకింగ్. దీనిని ఏ భారతీయుడూ హర్షించడు'' అన్నారు.

బీబీసీ న్యూస్ వాట్సాప్ తెలుగు చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'చర్చలు జరిగితే పీవోకేపైనే'

పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. "పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే, దాని ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టాలి" అని మోదీ అన్నారు.

"భారత్ వైఖరి చాలా స్పష్టం. ఉగ్రవాదం - చర్చలు ఒకేసారి సాధ్యం కావు, ఉగ్రవాదం - వాణిజ్యం సాధ్యం కావు, నీరు - రక్తం కూడా కలిసి ప్రవహించలేవు"

"పాకిస్తాన్‌తో ఏదైనా చర్చ జరిగితే, అది ఉగ్రవాదంపై మాత్రమే. అదే మా విధానం. పాకిస్తాన్‌తో ఏదైనా చర్చ జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పైనే" అని మోదీ స్పష్టం చేశారు.

భారత్, ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

'బ్లాక్‌మెయిల్‌ను సహించేది లేదు'

"గత కొద్ది రోజులుగా మనమందరం దేశ సామర్థ్యాన్ని, సహనాన్ని చూశాం. నేను సాయుధ దళాలు, సైన్యం, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా. మన సైన్యం అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించింది."

''కుటుంబం, కన్నబిడ్డల ముందే అమాయకుల ప్రాణాలు తీశారు. ఆపరేషన్ సిందూర్‌తో టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేశాం. బహావల్‌పూర్ గ్లోబల్ టెర్రరిజానికి యూనివర్సిటీ లాంటిది. ఆ యూనివర్సిటీని నేలమట్టం చేశాం. మన సోదరీమణులు, మన కూతుళ్ల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించాం.''

''పాక్ డ్రోన్లు, మిసైళ్లు మన ముందు నిలవలేకపోయాయి. భారత్ చర్యలతో పాకిస్తాన్ నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయింది'' అన్నారు మోదీ.

''పాకిస్తాన్ అణ్వాయుధ బ్లాక్‌మెయిల్‌ను ఇక సహించేది లేదు. అదే జరిగితే ఏం చేయాలో భారత్‌కు తెలుసు.''

పవన్ ఖేరా ఏమన్నారంటే..

పవన్ ఖేరా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, "ప్రధాని మోదీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు విన్నాం. అది ప్రతి భారతీయుడినీ కలవరపాటుకి గురిచేసింది. వాణిజ్యం నిలిపేస్తామన్న బెదిరింపుల వల్లే మనం చర్యలు ఆపేశామని డోనల్డ్ ట్రంప్ చెప్పారు, అది చాలా షాకింగ్ ప్రకటన.''

''ప్రధాన మంత్రి దానిపై స్పందిస్తారని, దేశ ప్రజలకు స్పష్టత ఇస్తారని ఆశించాం. కాంగ్రెస్ పార్టీ దీనిని హర్షిస్తుందా లేదా అనేది కాదు, సిందూర్‌‌ని పణంగా పెట్టి చేసే వ్యాపారాన్ని ఏ భారతీయుడూ హర్షించడు'' అని పవన్ ఖేరా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

చాలా ప్రశ్నలున్నాయి: సీపీఐ నేత డి.రాజా

భారత్‌ను తేలిగ్గా తీసుకోలేరని, భారతీయులందరూ ఐక్యంగా ఉన్నారని ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు బలమైన సందేశం పంపారని సీపీఐ ఎంపీ డి.రాజా అన్నారు.

అయితే, పహల్గాం ఘటన నుంచి కాల్పుల విరమణ వరకు చాలా ప్రశ్నలున్నాయన్నారు.

''ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ప్రజలపై ఎలా దాడి చేయగలిగారు? కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించామని అమెరికా అంటోంది. మనకంటే ముందే ప్రకటించారు, ప్రధాని దాని గురించి ప్రస్తావించలేదు?" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కాంగ్రెస్ నేత జైరాం రమేష్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ (ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

''డోనల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించిందా?. పాకిస్తాన్‌తో చర్చలకు తటస్థ వేదికకు భారత్ ఒప్పుకుందా?'' అని అందులో ప్రశ్నించారు.

ప్రధానమంత్రి వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జైరాం రమేశ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)