మట్టిలో భవనాలు.. తవ్వేకొద్దీ మృతదేహాలు.. వయనాడ్‌‌‌లో భయానక దృశ్యాలు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 150 దాటింది. భారీ వర్షాల కారణంగా మెప్పాడి, చూరల్మలై, ముండక్కే, అట్టామలై తదితర ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి.

ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాద తీవ్రతను ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి..