నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడేందుకు ఇంక్యుబేటర్‌ కంటే తల్లి స్పర్శే బెటరా?

వీడియో క్యాప్షన్, 'తల్లి శరీర స్పర్శతో నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడొచ్చు'
నెలలు నిండకుండా పుట్టే శిశువులను కాపాడేందుకు ఇంక్యుబేటర్‌ కంటే తల్లి స్పర్శే బెటరా?

కొలంబియా బొగోటాలోని శాన్ జువాన్ డే డియో హాస్పిటల్‌లో మెటర్నిటీ యూనిట్‌లో 1978లో ఇద్దరు శిశు వైద్య నిపుణులు మొదట ఈ విధానాన్ని ప్రతిపాదించారు. నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విధానం మేలైనదని చెబుతోంది.

ఇదివరకు ఇంక్యుబేటర్‌లు మాత్రమే ఉపయోగించాలని తమ మార్గదర్శకాల్లో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

అయితే, తాజా మార్గదర్శకాల్లో కంగారూ కేర్ కూడా మేలైనదేనని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా అందుబాటులోలేని ప్రాంతాల్లో ఇది మెరుగ్గా పనిచేస్తుందని వివరించారు.

‘‘కంగారూ కేర్’’తోపాటు పుట్టిన వెంటనే తల్లిపాలను ఇవ్వడంతో ఏటా 1,50,000కుపైగా శిశు మరణాలను అడ్డుకోవచ్చని కొత్త పరిశోధన చెబుతోంది.

ఇంక్యుబేటర్ కంటే మేలా?

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)