గాజా: యుద్ధం కారణంగా దూరమైన చిన్నారులు తమవారి దగ్గరకు ఎలా చేరారంటే..
గాజా: యుద్ధం కారణంగా దూరమైన చిన్నారులు తమవారి దగ్గరకు ఎలా చేరారంటే..
గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి , 17 వేల మంది చిన్నారులు ఒంటరిగా మిగిలిపోవడమో లేదా తల్లితండ్రులకు దూరమవడమో జరిగిందని అంచనా.
వీరిలో తమ పేర్లను కూడా పూర్తిగా పలకని పసిపిల్లలు ఉన్నారు.
బాంబు దాడులతో సామూహికంగా నిరాశ్రయులవుతున్న ప్రజలు కల్లోల పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారు. వీరిలో 63 మంది పిల్లల్ని తిరిగి తమ వాళ్లతో కలిపింది యూఎన్ పిల్లల సంస్థ యూనిసెఫ్.
మరి ఈ పసి పిల్లల ప్రయాణం ఎలా సాగిందో బీబీసీ ప్రతినిధి యొలాండ్ నెల్ అందిస్తున్న కథనంలో చూద్దాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









