You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిగాలులు
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు చలి గుప్పిట చిక్కుకున్నాయి.
కశ్మీర్‌లో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల -6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయాయి.
దాల్ సరస్సులో కొంత భాగం గడ్డకట్టింది. దీంతో అక్కడ పర్యటకుల కోసం బోట్లు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు.
కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి పైప్‌లైన్లు కూడా గడ్డకట్టేశాయి. రోడ్డు రవాణాకు అంతరాయాలు ఏర్పడి సరకుల సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
దీంతో స్థానికులకు రోజువారీ అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో చలి, శీతల గాలులు తీవ్రంగా ఉన్నాయి. దిల్లీలోని కొన్ని ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.2 డిగ్రీలకు పడిపోయాయి.
పేవ్‌మెంట్స్‌పై నివసించే నిరాశ్రయులంతా చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి.
రోజుకు సుమారు 23 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లే రైల్వే వ్యవస్థకు మంచు కారణంగా ఇబ్బందులు కలిగాయి.
అనేక రైళ్లు ఆలస్యమయ్యాయి.
కొన్ని రైళ్లు 10 గంటల పాటు ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
చలిగాలుల కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దిల్లీలో ఈ పరిస్థితి ఉంది. శీతాకాలంలో కాలుష్యం స్థాయి అధికంగా ఉండే దిల్లీలో చలిగాలులు కూడా తీవ్రం కావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
రాజస్థాన్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీని కారణంగా వ్యవసాయ పనులకు ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు చెప్తున్నారు.
అమృత్‌సర్‌ను గత కొద్దిరోజులుగా దట్టమైన మంచు కమ్మేస్తోంది. బస్‌లు, రైళ్లు సహా రవాణా వ్యవస్థకు ఆటంకమేర్పడుతోంది.
ఇవి కూడా చూడండి:
- 2023లో మానవ జీవితాల్ని మార్చబోయే 5 శాస్త్రీయ పరిశోధనలు
- ప్రేమ-సెక్స్: 2022లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి?
- ఆనాటి కారు యాక్సిడెంట్లో ఓ క్రికెటర్ చనిపోయాడు, ప్రాణాలతో బయటపడ్డవారు ప్రపంచ ప్రఖ్యాత ఆల్‌రౌండర్స్ అయ్యారు
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- క్యాథలిక్: చర్చిలో మతాధికారి హోదా కోసం మహిళల పోరాటం... ససేమిరా అంటున్న వాటికన్ వర్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)