రూ.41 కోట్లు పలికిన ఒంగోలు జాతి ఆవు
ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త మరోసారి తన సత్తాను చాటింది.
బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతి ఆవు ఏకంగా భారత కరెన్సీలో 41 కోట్ల రూపాయలు పలికి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది.

ఏమిటీ ఈ జాతి పశువుల ప్రత్యేకత?
తెల్లని శరీరం, సౌష్టవం, రంకెల్లో రాజసం, చూపరులను ఆకట్టుకునే మూపురం.. ఒంగోలు జాతి పశువుల పేరు ఎత్తగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేవి ఇవే.
ఎద్దుల్లో అనేక జాతులున్నా ఒంగోలు జాతి గిత్తలకు ఉన్న క్రేజ్ వేరు. ఎందుకంటే దాదాపు 1100 కేజీల బరువు ఉండే ఒంగోలు గిత్తలు చాలా బలిష్టంగా ఉంటాయి. వేడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. అనారోగ్యానికి అంత తొందరగా గురికావు. చురుగ్గా ఉంటాయి. కాడి కట్టుకుని పొలంలోకి దిగితే ఐదారెకరాలు దున్నేయగల శక్తితో ఉంటాయని చెబుతారు. అలాంటి గిత్తల పుట్టినిల్లు ప్రకాశం జిల్లా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









