‘నాటోలో చేరం, తటస్థంగానే ఉంటాం’ - శాంతి చర్చల్లో రష్యాకు యుక్రెయిన్ హామీ

ఇస్తాంబుల్ వేదికగా యుక్రెయిన్, రష్యా శాంతి చర్చలు జరిగాయి. యుక్రెయిన్‌ రాజధాని నగరం కీయెవ్, మరొక నగరం చెర్నిహివ్‌లపై దాడులను గణనీయంగా తగ్గిస్తామని రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ హామీ ఇచ్చారు.

లైవ్ కవరేజీ

  1. విల్ స్మిత్ భార్య జెడా పింకెట్‌: జుట్టు విపరీతంగా రాలిపోయే ఈ అలపీషియా జబ్బు ఏంటి?

    జడా

    ఫొటో సోర్స్, FACEBOOK/JADA

    హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య జెడా పింకెట్ ఒక జబ్బు కారణంగా గత రెండు రోజులుగా వార్తల్లో ఉన్నారు.

    ఆస్కార్ అవార్డుల వేదికపై స్టాండ్ అప్ కమెడియన్ క్రిస్ రాక్‌ ఆమెపై జోక్ చేయడంతో స్మిత్ వేదికపైకి వెళ్లి రాక్ చెంపపై కొట్టారు. దీంతో, ఇది వార్తగా మారిపోయింది.

    రాక్ జెడా పింకెట్ గుండును జీఐ జేన్ సినిమాలో నటించిన డెమీ మూర్ తో పోల్చారు. ఆమె సినిమా కోసం గుండు చేయించుకున్నారు.

    జెడా పింకెట్ కున్న పొట్టి జుట్టు వల్ల రాక్ డెమీ మూర్ గుండుతో పోల్చారు. ఆయన "ఐ లవ్ యూ జీ. నిన్ను జీఐ జెన్ 2 లో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.

    అమెరికన్ నటి జెడా పింకెట్ 'ది మ్యాట్రిక్స్ ఫ్రాంచైస్', గోథామ్' సినిమాల్లో నటనకు బాగా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఆమె చాలా ఇంటర్వ్యూలలో ఆమె జుట్టు ఎందుకలా ఉందో చెప్పారు. ఆమె జుట్టు విపరీతంగా ఊడిపోతుండటంతో గుండు చేయించుకున్నట్లు చెప్పారు.

    విపరీతంగా జుట్టు రాలే పరిస్థితిని వైద్య పరిభాషలో అలపీషియా అంటారు.

  2. Algeria: ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..

    అల్జీరియా

    ఫొటో సోర్స్, AFP

    అల్జీరియాలో వంట సరుకుల ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆఖరుకి వంట నూనె, పాల కోసం కూడా షాపు యజమానులను మచ్చిక చేసుకోవాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.

    మొన్నటి వరకు కరోనా వైరస్ ఆంక్షలు, ప్రస్తుతం యుక్రెయిన్ లో యుద్ధం వినియోగదారుల జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి.

    "వంట నూనె కొనుక్కోవాలంటే డ్రగ్స్ కొనుక్కుంటున్నట్లుగా ఉంటోంది" అని 31 సంవత్సరాల సమీహ సామర్ చెప్పారు. ఆమె గొంతులో ఈ పరిస్థితి మారదనే అనుమానం, చికాకుతో కూడిన భావం ఆమె గొంతులో వినిపించింది.

    ఆమెకు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేకులు తయారు చేయడమంటే చాలా ఇష్టం. ఈ ఆసక్తి ద్వారా ఆమె కొంత ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. అయితే, పెరిగిన ధరల వల్ల ఆమెకు కావల్సిన వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు.

  3. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోళ్లు ఎందుకు పెంచింది - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

    ఇండియా ఆయిల్

    ఫొటో సోర్స్, Getty Images

    చమురు దిగుమతుల మీద ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా కొత్త మార్కెట్‌ల కోసం వెతుకుతోంది. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చవక ధరల్లో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పనిలో పడింది.

    అయితే, ఇలా చమురు దిగుమతి చేసుకోవడం ఆంక్షలను ఉల్లంఘించడం కాకపోయినా, ఇది పరోక్షంగా యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను సమర్ధించడమేనని అమెరికా అంటోంది.

    ఇండియాకు ఆయిల్ ఏఏ దేశాల నుంచి వస్తుంది?

  4. భారత్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం ఉందా?

    భారత్‌లో హిందువులు

    ఫొటో సోర్స్, Getty Images

    "హిందువులు అల్పసంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వారిని మైనారిటీలుగా గుర్తించవచ్చు" అంటూ కేంద్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

    దాంతో, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో, వారికి మైనారిటీ హోదా కల్పించడం వీలవుతుందా, ఏ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వాలు హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వగలవు, దీనివల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.

  5. ‘మేం తటస్థంగానే ఉంటాం’ – రష్యా హామీలకు స్పందనగా యుక్రెయిన్ హామీ

    శాంతి చర్చలు

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలను గణనీయంగా తగ్గిస్తామని రష్యా హామీ ఇవ్వగా.. అందుకు ప్రతిగా తాము తటస్థ స్థితిని కొనసాగిస్తామని యుక్రెయిన్ హామీ ఇచ్చింది.

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన శాంతి చర్చల్లో ఇది చాలా ముఖ్యమైన పురోగతి అని ఇస్తాంబుల్‌లోని బీబీసీ ప్రతినిధి టామ్ బాట్‌మాన్ చెప్పారు.

    తటస్థ స్థితి అంటే నాటోలో కానీ, ఏ ఇతర సైనిక కూటములలో కానీ యుక్రెయిన్ చేరదు. అలాగే, తమ దేశంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు ఏ దేశానికీ అనుమతి ఇవ్వదు.

    గతంలో నాటోలో చేరతామని యుక్రెయిన్ ప్రకటించింది. ఈ విజ్ఞప్తిని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది.

    కాగా, రష్యా కలుపుకున్న క్రైమియా అంశంపై 15 ఏళ్ల సంప్రదింపుల సమయం ఉండాలని, అప్పటి వరకూ రష్యా ఎలాంటి కాల్పులూ జరపకూడదని.. ఆ గడువు ముగిసిన తర్వాత క్రైమియా పరిస్థితిపై నిర్ణయం ఉంటుందని యుక్రెయిన్ షరతు విధించింది. రష్యా అధ్యక్షుడు జెలియన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ప్రత్యక్ష సమావేశానికి సంబంధించి కూడా సానుకూలంగా స్పందించింది.

    అయితే, రష్యా సమాధానం కోసం తాము ఎదురుచూస్తున్నామని యుక్రెయిన్ ప్రతినిధులు చెప్పారు.

  6. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ యుద్ధం: ‘దాడుల్ని బాగా తగ్గించేస్తాం’ – శాంతి చర్చల్లో రష్యా హామీ

    రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం టర్కీలో సమావేశయ్యారు.

    ఈ సందర్భంగా యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్, మరొక నగరం చెర్నిహివ్‌లపై దాడులను గణనీయంగా తగ్గిస్తామని రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ హామీ ఇచ్చారు.

    యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య ఇస్తాంబుల్‌లో మూడు గంటల పాటు చర్చలు జరిగాయి.

    అనంతరం రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులను తగ్గిస్తామని చెప్పారు. అలాగే, ఇరు దేశాల మధ్య లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడమే అంతిమ లక్ష్యం అని, దాని కోసం తాము తీసుకునే చర్యలు సహకరిస్తాయని తెలిపారు.

  7. ఆంధ్రప్రదేశ్: వెలిగొండ ప్రాజెక్ట్ నీళ్లు రావడం ఎందుకు ఆలస్యమవుతోంది?

    వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్

    ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రాజెక్టుల్లో పోలవరంతో పాటుగా వెలిగొండ ప్రాజెక్టు కూడా ఒకటి.

    మూడు దశాబ్దాల క్రితం శంకుస్థాపన జరిగిన వెలిగొండ నిర్మాణం నేటికి ఇంకా పూర్తి కాలేదు.

    ఏడాది క్రితమే ఒక టన్నెల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే ప్రయత్నం మాత్రం జరగలేదు.

  8. ‘శాంతి చర్చల్లో ఏమి తినకండి, తాగకండి’

    యుక్రెయిన్ విదేశాంగమంత్రి

    ఇస్తాంబుల్ వేదికగా యుక్రెయిన్, రష్యా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొనే ప్రతినిధులను ఏమి తినవద్దు, తాగవద్దని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సూచించారు.

    ఈ నెల మొదట్లో జరిగిన శాంతి చర్చల్లో రష్యాకు చెందిన సంపన్నుడు రోమన్ అబ్రామోవిచ్ మీద విషప్రయోగం జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  9. ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు చెందిన 4.7శాతం వాటా కొన్న భారతీ ఎయిర్‌టెల్

    భారతీ ఎయిర్‌టెల్ భవనం

    ఫొటో సోర్స్, ANI

    ప్రపంచంలోని అతి పెద్ద సెల్‌ఫోన్ల టవర్ల కంపెనీ అయిన ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు చెందిన 4.7శాతం వాటాను కొనుగోలు చేసినట్లు భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది.

    ఈ డీల్ కోసం భారతీ ఎయిర్‌టెల్ రూ.2,388 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.

    ఇండస్ టవర్స్, 184,748 టవర్లతో ప్రపంచంలోని అతి పెద్ద టవర్ల కంపెనీలలో ఒకటిగా ఉంది.

  10. ఫెడ్‌ఎక్స్ సీఈఓగా రాజ్ సుబ్రమణియన్

    ఫెడ్‌ఎక్స్ సీఈఓగా ఎంపికైన రాజ్ సుబ్రమణియమ్

    ఫొటో సోర్స్, FedEx.Com

    అమెరికాకు చెందిన కొరియర్ కంపెనీ ఫెడ్‌ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన రాజ్ సుబ్రమణియమ్ నియమితులయ్యారు.

    ప్రస్తుతం ఫెడ్‌ఎక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న రాజ్, ఈ ఏడాది జూన్ 1 నుంచి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    ప్రస్తుతం చైర్మన్, సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ.స్మిత్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారనున్నారు.

    ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం రాజ్ సుబ్రమణియమ్ స్వస్థలం కేరళలోని త్రివేండ్రం.

    1991లో ఆయన ఫెడ్‌ఎక్స్‌లో చేరారు. 30 ఏళ్లకు పైగా సాగించిన తన ప్రయాణంలో అంచలంచెలుగా ఎదుగుతూ 2020లో ఫెడ్‌ఎక్స్ బోర్డులో జాయిన్ అయ్యారు.

    అంతర్జాతీయ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో వ్యూహాలు రచించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ రాజ్‌కు మూడు దశాబ్దాలకుపైగా అనుభవం ఉందని ఫెడ్‌ఎక్స్ చెబుతోంది.

    ప్రపంచంలోనే అతి గొప్ప సంస్థల్లో ఒకటైన ఫెడ్‌ఎక్స్‌ను ఫ్రెడరిక్ స్థాపించాడని, ఇప్పుడు ఆ సంస్థను ముందుకు నడపే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవమని రాజ్ అన్నారు.

    1971లో స్థాపించిన ఫెడ్‌ఎక్స్‌, భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 6 లక్షల మంది పని చేస్తున్నారు.

  11. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్‌గా మీరా బాయి చాను... కట్టెలు మోసే అమ్మాయి ఈ స్థాయికి ఎలా వచ్చింది?

    బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్‌-2021 విజేతగా మీరా బాయి చాను నిలిచారు. వెయిట్ లిఫ్టర్ అయిన చాను, కట్టెలు మోసే స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగారు.

  12. రాహుల్ గాంధీ: ‘తెలంగాణ రైతులతో రాజకీయాలు చేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ’

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులతో టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

    బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విడిచిపెట్టి... రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    ‘రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులను క్షోభ పెట్టే పనులు మాని పండించిన ప్రతి గింజా కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుంది.’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్లు చేశారు.

    ఇక రాహుల్ గాంధీ ట్వీట్లపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ట్విటర్లో నామమాత్రంగా సంఘీభావం తెలపకుండా పార్లమెంటులో పోరాడాలని కవిత ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 4

  13. యుక్రెయిన్ ప్రజల కష్టాలు చిత్రాల్లో...

    సబ్ వేలలో తలదాచుకుంటున్న యుక్రెయిన్ ప్రజలు

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తున్న క్రమంలో యుక్రెయిన్ ప్రజల జీవితాలు చితికిపోతున్నాయి. ఖార్కివ్‌లో వేలాది మంది ప్రజలు సబ్ వేలలో తలదాచుకుంటున్నారు.

    యుక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల మంది పారిపోయినట్లు ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

    యుక్రెయిన్ సబ్ వేలో తలదాచుకున్న కుటుంబం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ సబ్ వేలో తలదాచుకున్న కుటుంబం

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ సబ్ వేలో తలదాచుకున్న కుటుంబం

    ఫొటో సోర్స్, Getty Images

  14. లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు

    బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్

    ఫొటో సోర్స్, Getty Images

    నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ గత ముగింపు 57,593తో పోలిస్తే 57,814 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ కూడా గత ముగింపు 17,222తో పోలిస్తే 17,297 వద్ద ప్రారంభమైంది.

    నిఫ్టీ ఆటో 0.80%, ఐటీ 0.36%, ఫార్మా 0.76%, ఎఫ్‌ఎంసీజీ 0.25% వంటి రంగాలలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

    టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.

  15. ‘కొన్ని మార్గాల్లో విమాన టికెట్ల రేట్లను సమీక్షిస్తాం’

    విమానప్రయాణ టికెట్ల ధరలు హేతుబద్ధంగా ఉండేలా చూసేందుకు కొన్ని మార్గాల్లోని రేట్లను సమీక్షించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయక మంత్రి వికే సింగ్ రాజ్యసభకు తెలిపారు.

    ‘విమానప్రయాణ టికెట్ల ధరలను ప్రభుత్వం నియంత్రించడం లేదు. కార్యకలాపాలకు అయ్యే ఖర్చు, లాభం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని విమానయాన సంస్థలు ధరలు నిర్ణయించుకోవచ్చు.

    అయితే అధికంగా ఛార్జ్ చేయకుండా, అకస్మాత్తుగా ధరలు పెంచకుండా నిరోధించేందుకు విమానయాన సంస్థలు ధరలను వెబ్‌సైట్లో ప్రకటించాల్సి ఉంటుంది.’ అని డీజీసీఏ వెల్లడించింది.

  16. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యాంశాలు

    స్కూటీలో పెట్రోలు కొట్టించుకుంటున్న మహిళలు

    ఫొటో సోర్స్, Getty Images

    అంతర్జాతీయం

    • శాంతి చర్చల కోసం రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ చేరుకున్నారు. కాల్పుల విరమణే తమ తొలి ప్రాధాన్యమని యుక్రెయిన్ చెబుతోంది.
    • రష్యా మీద మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ప్రపంచదేశాలను కోరారు.
    • ఈ నెల ప్రారంభంలో జరిగిన శాంతి చర్చల్లో రష్యా సంపన్నుడు రొమన్ అబ్రమోవిచ్ మీద విషప్రయోగం జరిగినట్లుగా కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికి ఆయన కోలుకోలేదని తెలిపాయి.

    జాతీయం

    • మరొకసారి పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగాయి. లీటరు పెట్రోలు 80 పైసలు, లీటరు డీజిల్ 70 పైసలు చొప్పున పెంచారు. ఇప్పటికి ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి.
    • సినీ నటి భావనపై లైంగికదాడి కేసులో సోమవారం సినీ నటుడు దిలీప్‌ను పోలీసులు సుమారు 7 గంటల పాటు విచారించారు.
    • కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్ రెండో రోజుకు చేరుకుంది. కొత్త లేబర్ కోడ్స్‌, ప్రైవేటీకరణ వంటి అంశాలను వ్యతిరేకిస్తూ మార్చి 28, 29న బంద్ చేపడుతున్నారు.

    స్థానికం

    • నేటితో 40ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు దేశం పార్టీ. 1982 మార్చి 29న నందమూరి తారకరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు.
  17. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.