ధన్యవాదాలు..
ఈ పేజీలో లైవ్ అప్డేట్స్ ముగిశాయి. తాజా సమాచారం కోసం బీబీసీ ఇంగ్లీష్ లైవ్ పేజీని చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
బలమైన పార్టీని నడపడం అంటే వేలకోట్లు ఉండటం కాదని, సైద్ధాంతిక బలం ఉండాలని, ఆ సిద్ధాంతాలతో బతికే వ్యక్తులు ఉండాలని.. అలా 150 మందితో ప్రారంభమైన తమ పార్టీకి ఇప్పుడు 5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, వరికూటి రామకృష్ణ
ఈ పేజీలో లైవ్ అప్డేట్స్ ముగిశాయి. తాజా సమాచారం కోసం బీబీసీ ఇంగ్లీష్ లైవ్ పేజీని చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

ఫొటో సోర్స్, facebook/janasenaparty
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ముందొకమాట స్పష్టంగా చెప్పుకోవాలి. అది ఆయన తరగని జనాకర్షణ. తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా జనాకర్షణ ఉన్న నాయకుడెవరూ లేరనే చెప్పాలి. లారీ బస్సులు పెట్టి తోలకపోయినా, బిరియానీలు, క్వార్టర్ బాటిల్ పంచకపోయినా, పవన్ సభలకు జనం, ముఖ్యంగా యువకులు, పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఎనిమిదేళ్ల కిందట 2014 మార్చిలో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఆయన మెరుగు తరగ లేదు. ఆయన్ను వేదిక మీద చూసినప్పటినుంచి అరుపులు కేకలు చప్పట్లు మొదలవుతాయి. 'పవన్ సీఎం' నినాదం వినపడుతుంది. ఎటొచ్చి చిక్కేమిటంటే ఈ ప్రేక్షకులకి 'జనసేన నేత'కి సంబంధం లేదు. ఆయన చెప్పేవాటిని వాళ్లెవరూ వినడం లేదని ఏ సభని చూసినా అర్థమవుతుంది. వాళ్ల దారి వాళ్లది, పవన్ దారి పవన్ ది. వాళ్లంతా 'పవర్ స్టార్'ను చూడ్డానికి వస్తున్నారు తప్ప, ఒక రాజకీయ నాయకుడి కోసం, ఆయన చెప్పేది వినడం కోసం వస్తున్నట్లు లేరు.
అందుకే వాళ్లెవరూ సభ నుంచి 'జనసేన పార్టీ'ని ఇంటికి తీసుకెళ్లడం లేదు. సినిమా ప్రిరిలీజ్ పంక్షన్‌కి వచ్చినట్లు వస్తున్నారు. వెళ్లిపోతున్నారు. ఎందుకిలా జరుగుతూ ఉంది? ఒక రాజకీయకుడిగా, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆరాటపడుతున్న నేతగా వాళ్ల మనసుల్లో ఎందుకు పవన్ కల్యాణ్ ముద్రవేయలేకపోతున్నారు? ఆయనకు, ఆయన అభిమానులకు మధ్య సినిమా పెద్ద గోడలాగా తయారయింది. ఎందుకిలా జరగుతున్నది? సినిమా గోడ ఛేదించి ఆయన రాజకీయాల్లోకి రాలేకపోయేందుకు కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, State Emergency Service of Ukraine/Reuters
యుక్రెయిన్‌పై రష్యా దండెత్తి నేటికి 19 రోజులు. తాజా పరిణామాలు ఇవీ..
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం ముగిసిన తర్వాత అధికార పార్టీ నాయకులు స్పందిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ పల్లకీ మోయడానికి జనసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం ఇదేనని వైసీపీ నాయకుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇస్తానని తనకు చెప్పారని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.
‘వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో చెప్పండి మేం చేస్తాం’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శక్తులన్నీ కలిశాయని, అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు కలవాలని తెలిపారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని, అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వచ్చినప్పుడు.. అప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు.
తాను అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తినని, ఎవరి నుంచి ఏమీ ఆశించనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను తాను, జనసేన తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

2024లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
పార్టీ ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు ముగిసిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.
తనకు విధానాలకు సంబంధించి విబేధాలు ఉన్నాయే తప్ప వ్యక్తిగతంగా తాను ఎవరిపైనా దాడి చేయనని పవన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుందని తెలిపారు. మూడు రాజధానులు అన్న విషయాన్ని వైసీపీ ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
వ్యవస్థను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, వ్యక్తులను మాత్రం ప్రశ్నించొచ్చు అని.. తాను అలాగే చేస్తానని అన్నారు.

బలమైన పార్టీని నడపడం అంటే వేలకోట్లు ఉండటం కాదని, సైద్ధాంతిక బలం ఉండాలని, ఆ సిద్ధాంతాలతో బతికే వ్యక్తులు ఉండాలని.. అలా 150 మందితో ప్రారంభమైన తమ పార్టీకి ఇప్పుడు 5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
ఇతర పార్టీల్లో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని, జనసేనలో మాత్రం అలాంటివారు ఎవరూ లేరన్నారు.
నాయకత్వం అంటే నిబద్ధతతో ఉండటం అని, ఇచ్చిన మాటను తప్పకపోవడమని, ద్వేషించే శత్రువులను కూడా క్షమించి వదిలివేయటమని, ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్లిపోకుండా ఉండటమని.. తాను పాటించనిది ఏదీ చేయమని కార్యకర్తలను కోరనని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులమయం అవుతోందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యం అన్నారు.
విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలను హైటెక్ నగరాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభ్యుదయ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామన్నారు.
కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరుపెడతామన్నారు.
ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిపోయిన రాయలసీమ యువత తిరిగి వచ్చేలా చేస్తామన్నారు.


''అదిసరే కానీ, కశ్మీరీ పండిట్లు తిరిగి తమ ఇళ్లకు, కశ్మీర్‌కు వెళ్లే అవకాశం లభిస్తుందా?''
తాజాగా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా మొత్తం కథను ఈ ఒక్క డైలాగ్ వివరిస్తోంది.
ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఈ సినిమా పేరు మార్మోగుతోంది.
కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లు వలసవెళ్లిపోవడంపై బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ సినిమా మార్చి 11వ తేదీన విడుదలైంది.
నాలుగు రాష్ట్రాలు.. హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇవన్నీ బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలు.
దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది. కొన్నిచోట్ల హౌస్‌ఫుల్ షోలు కూడా పడుతున్నాయి.

భారతదేశపు క్షిపణి ఒకటి పొరపాటున పాక్ భూభాగంలో పడటంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పాకిస్తాన్ కోరుకుంటే దానికి ప్రతీకారంగా ఏదైనా చేయగలదని, కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని ఇమ్రాన్ ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, facebook/Bro.M.Anilkumar
‘‘మావాళ్లు రాజకీయంగా చాలా చెప్పారు. రాజకీయ పార్టీ అంటే అషామాషీ విషయం కాదు. ముందు వీళ్ల సమస్యలు క్లియర్ అవ్వాలి. (రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ ఉందా అని అడగ్గా...) అవును ఉంది. నా మాట కూడా వినకపోతే బీసీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని వీళ్లు అన్నారు. ఎందుకంటే నా మాట చెల్లనప్పుడు, వినప్పుడుమీ ఇష్టం అన్నాను. (మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారా? అని అడిగినప్పుడు..) ఖచ్చితంగా చేస్తా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు.
విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ప్రస్తుతం రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలు విని, పరిష్కరించే వాళ్లు ఎవరు లేరు, అందుకే నాతో వారు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు’అని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. విశాఖలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్‌కుమార్ భేటీ అయ్యారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని అనిల్ తెలిపారు.
‘ఒక వ్యక్తి వలన ఏదీ సాధ్యపడదు. అందరూ కలిసి ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చారు, అది సరిగా చేయాలి. అప్పుడే ప్రభుత్వం అందరిది అవుతుంది’ అన్నారు.
బ్రదర్ అనిల్ సమావేశాలకు కారణాలేంటి?
కొద్ది రోజుల ముందు బ్రదర్ అనిల్ విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇదంతా కొత్త పార్టీ పెట్టేందుకే అని ప్రచారం జరిగింది. అయితే దానిని బ్రదర్ అనిల్ ఖండించారు.
క్రైస్తవులకు చాలా సమస్యలు ఉన్నాయని...వాటికి సమాధానం దొరుకుతుందనే జగన్ కు ఓటేశామని...అయితే ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకే అవకాశం రావడం లేదని ఏఐసీసీ (ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్) ప్రతినిధి హానోక్ అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. వాళ్లంతా ఒకే విధమైన లక్షణాలతో మరణించారు. అందరికీ ఉన్నట్టుండి వాంతులు, కడుపునొప్పి రావడం, పల్స్ రేట్ పడిపోయి హఠాత్తుగా ప్రాణాలు విడిచినట్లు మృతుల బంధువులు, వైద్యులు చెబుతున్నారు. ఈ మరణాలకు కారణం నాటుసారాలో కల్తీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిని తోసిపుచ్చుతోంది. అందుకు ఆధారాలు లేవంటూ కొట్టిపారేస్తోంది. కోవిడ్ తర్వాత తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలే ఈ మరణాలకు కారణమని చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చౌకగా చమురు అమ్ముతామని రష్యా ఇచ్చిన ఆఫర్‌ను భారత్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇతర సరకులు కూడా కొనే అవకాశం ఉందని ఇద్దరు భారతీయ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈమేరకు రూపీ, రూబుల్స్‌లో వాణిజ్యానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో రష్యా మీద పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. దిగుమతి చేసుకునే చమురులో సాధారణంగా రెండు నుంచి మూడు శాతం మాత్రమే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం రష్యా, యుక్రెయిన్ యుద్ధం వల్ల ముడి చమురు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందని అని అన్నారు బ్రదర్ అనిల్ కుమార్. విశాఖపట్నంలో నేడు ఆయన బీసీ, మైనార్టీ సంఘాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. బీసీలకు సీఎం పదవి ఇవ్వాలనే వారికి మద్దతు ఇస్తానని కూడా ఆయన అన్నారు. పార్టీ అంటే ఒక్కరోజులో ఏర్పాటు చేసేది కాదని అన్న ఆయన, ఎన్నికల ముందు తనను నమ్మి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేసిన వారు నేడు బాధల్లో ఉన్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, Bro. Anil kumar/Facebook
జంగారెడ్డి గూడెంలో జరిగినవి సహజ మరణాలేనని, అవి కల్తీ సారా వల్ల జరిగినవి కావని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. కల్తీ సారా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అక్రమంగా రవాణా చేసే వారిని ఉక్కు పాదంతో అణచివేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డి గూడెంలో ప్రస్తుతం సుమారు 54 వేల జనాభా ఉండొచ్చని, ఇంత జనాభాలో సజహంగానే 90 మంది వరకు చనిపోతారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/YS Jagan Mohan Reddy

ఫొటో సోర్స్, Getty Images
రష్యా దాడులు కీయెవ్‌లోని ఆంటోనోవ్ విమానాల తయారీ ప్లాంట్ మీద జరిగాయని ఆంటోనోవ్ ఎయిర్‌పోర్ట్ మీద కాదని కీయెవ్ నగర పాలక సంస్థ వెల్లడించింది. అంతకు ముందు ఆంటోనోవ్ ఎయిర్‌పోర్ట్ మీద రష్యా బాంబులు వేసినట్లు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
జంగారెడ్డి గూడెం మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వ వివరణ కోసం పట్టుపడుతూ అసెంబ్లీలో నిరసనకు దిగిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కింజారపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోల బాలస్వామి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుంది.
రష్యా దాడి మొదలైన తరువాత ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది యుక్రెయిన్ వదిలి చుట్టుపక్కల దేశాలకు పారిపోయారు. యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలై 19 రోజులు అవుతోంది. స్లోవేకియాకు చేరుకున్న కొందరు శరణార్థుల చిత్రాలను ఇక్కడ చూడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కీయెవ్‌లోని ఆంటోనోవ్ ఎయిర్‌పోర్ట్ మీద రష్యా దాడులు చేస్తున్నట్లు యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్‌కు అత్యంత ముఖ్యమైన మిలిటరీ ఎయిర్ బేస్‌గా ఉన్న ఈ విమానాశ్రయం ఇంటర్నేషనల్ కార్గోకు కూడా చాలా కీలకంగా ఉంది.

ఫొటో సోర్స్, facebook/ganta srinivasarao
తన రాజీనామాను ఆమోదించాలని మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన తన లేఖలో గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు కార్మికులు ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో తన రాజీనామాను ఆమోదించాలని గంటా ఆ లేఖలో స్పీకరును కోరారు.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌పై దాడులు జరగడం వల్ల ఒక వ్యక్తి చనిపోవడంతోపాటు ముగ్గురు గాయపడినట్లు యుక్రెయిన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే రెండు మృత దేహాలు దొరికినట్లు యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ చెబుతోంది. తొమ్మిది అంతస్తులు గల భవనంలో నుంచి మంట, పొగ వస్తున్న ఫొటోలను యుక్రెయిన్ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Ukraine State Emergency Service

ఫొటో సోర్స్, UGC
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడంతోపాటు కాగితాలు చింపి స్పీకర్‌పై విసిరారు. దాంతో సభలోకి మార్షల్స్ రావాల్సి వచ్చింది. శవ రాజకీయాలు చేస్తోందంటూ టీడీపీని విమర్శించారు మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు. గందరగోళం మధ్య సభ వాయిదా పడింది.