శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది? ఈ శిక్షఎంత క్రూరంగా ఉండేది?

వీడియో క్యాప్షన్, శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది? ఈ శిక్షఎంత క్రూరంగా ఉండేది?

శిలువపై మరణించిన వారిలో ఏసు క్రీస్తు ప్రముఖులు. ఆయన జననం కంటే కొన్ని శతాబ్దాల ముందు కూడా ఈ దారుణ శిక్ష అమలులో ఉండేది. ఈ శిక్ష అమలు తీరు చాలా క్రూరంగా ఉండేది. ఈ శిక్షతో భరించలేని నొప్పి వస్తుంది. మొదట చాలా రక్తం పోతుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. చాలా కేసుల్లో మరణం చాలా నెమ్మదిగా వస్తుంది.

''ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన మూడు మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది. బతికుండగానే నిప్పు పెట్టడం, తల నరికేయడం ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయి''అని దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ యూనివర్సిటీ పరిశోధకురాలు, రచయిత లూసీ సిలీర్స్ చెప్పారు.

''క్రూరత్వానికి ఇది ప్రతీక. అంతేకాదు చూసేవారిలోనూ ఇది భయాన్ని పుట్టిస్తుంది'' అని స్పెయిన్‌లోని నవరా యూనివర్సిటీ థియోలజీ ప్రొఫెసర్ డీగో పెరేజ్ గోడార్ వ్యాఖ్యానించారు.

శిలువ వేయడం పశ్చిమ ఆసియాలోని అస్సిరియా, బాబిలోనియా నాగరికతల్లో పుట్టి ఉండొచ్చని సిలీర్స్ చెప్పారు. ''క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో పర్షియాలో శిలువ వేయడం ద్వారా మరణ శిక్ష విధించినట్లు చరిత్ర చెబుతోంది'' అని ఆమె వివరించారు. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)