ఏటా శ్రీరామ నవమి నాడు భక్తులు తమ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు. తర్వాత కొనుక్కుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో ఏటా పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి తిరిగి కొనుక్కుంటారు.
శ్రీరామ నవమి నాడు తమ కన్నబిడ్డను గుడికి సమర్పించి, ఆ తరువాత కొంత మొత్తం చెల్లించి తిరిగి పిల్లలను వెనక్కి తీసుకోవడం ఇక్కడ చాలామంది అనుసరించే సంప్రదాయం.ఇలా పిల్లలను దేవునికి ఇవ్వడాన్ని అమ్మేయడం అని వీరు పిలుస్తారు.
ఇలా పిల్లల్ని దేవుడికి ఇచ్చేసి, మళ్ళీ తామే కొనుక్కోవడం వల్ల అంతా మంచి జరుగతుందని ఇక్కడివారు నమ్ముతున్నారు.
ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలోని తలంబ్రాలను పరమాన్నం వండుకుని తింటారని అర్చకుడు చెబుతున్నారు. 1889లో నిర్మించిన ఈ ఆలయంలో అప్పటి నుంచే ఇది ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్‌గా గెలిచిన తొలి ముస్లిం హమ్జా యూసఫ్ ఎవరు?
- వెతుకుతుంటే దొరికిన రాయి కోటి రూపాయలు తెచ్చింది... ఎలా?
- 90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)