బ్రెజిల్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలలో పైచేయి సాధించిన లూలా డ సిల్వా

వీడియో క్యాప్షన్, అధ్యక్షుడిగా లూలాకు రానున్న ఏడాది పెను సవాలే అంటున్న విశ్లేషకులు

బ్రెజిల్‌లో నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఆసక్తికర పోరులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు లూలా డ సిల్వా.

గతంలో రెండు సార్లు దేశాధ్యక్షుడిగా ఎన్నికైన లూలా 2010 చివరలో గద్దె దిగారు. ఆ తర్వాత అవినీతి కేసులో 18 నెలలపాటు జైలు జీవితం గడిపి చివరకు నిర్దోషిగా విడుదలయ్యారు.

ఆయనకు, బొల్సొనారోకు మధ్య గట్టి పోటీ నడిచింది. బొల్సొనారో 49శాతం ఓట్లు సాధించగా, 51 శాతం ఓట్లతో లూలా మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.

బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్ అందిస్తున్న కథనాన్ని ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)