సముద్రంలో పశ్చిమ దేశాలకు వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్‌కు ప్రమాదం పొంచి ఉందా, మైక్రోసాఫ్ట్ ఎందుకు హెచ్చరించింది?

వీడియో క్యాప్షన్, సముద్రంలో పశ్చిమ దేశాలకు వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్‌కు ప్రమాదం పొంచి ఉందా, మైక్రోసాఫ్ట్ ఎందుకు హెచ్చరించింది?

సముద్రం లోతుల్లో నుంచి వేసిన ఇంటర్నెట్‌ కేబుల్స్‌ భద్రత విషయంలో పశ్చిమ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ సూచించారు.

రష్యా నుంచి జర్మనీకి గ్యాస్‌ సరఫరా చేసే నోర్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌పై గత వారం జరిగిన దాడుల దృష్ట్యా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా, యుక్రెయన్‌పై ఆక్రమణకు దిగిన తర్వాత-తమ సైబర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్ధంగా పని చేస్తోందని బీబీసీతో చెప్పారు.

అయితే యుద్ధ క్షేత్రంలో గట్టి ఎదురు దెబ్బలు తింటోన్న రష్యా - సైబర్ స్పేస్‌లో దాడులను తీవ్రతరం చేయవచ్చని హెచ్చరించారు.

బీబీసీ ప్రతినిధి గోర్డన్ కొరెరా అందిస్తోన్న రిపోర్ట్‌ను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)