యజమాని ఒత్తిడిలో ఉంటే పెంపుడు కుక్క పసిగడుతుందా

వీడియో క్యాప్షన్, యజమాని ఒత్తిడిలో ఉంటే పెంపుడు కుక్క పసిగడుతుందా

మనుషుల భావోద్వేగాలను కుక్కలు ఎంత బాగా అర్థం చేసుకుంటాయనేది మరోసారి రుజువైంది. ఈసారి శాస్త్రీయంగా నిర్వహించిన ఒక వాసన పరీక్షలో ఓ కొత్త విషయం వెల్లడైంది.

మనం ఒత్తిడికి గురవుతున్నట్లయితే.. మన శ్వాసలో, మన చెమటలో ఆ ఒత్తిడి వాసనను పెంపుడు కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

నాలుగు పెంపుడు కుక్కలకు మూడు రకాల వాసనలున్న డబ్బాలను వాసన చూసేలా శిక్షణనిచ్చారు. ఆ కుక్కలను వాటి యజమానులు స్వచ్ఛందంగా ఈ ప్రయోగంలో పాల్గొనేందుకు తెచ్చారు.

ఈ కుక్కలు మొత్తం 700 ట్రయల్స్‌లో 650 సార్లకు పైగా.. ఒత్తిడిలో ఉన్న వ్యక్తి నుంచి సేకరించిన శ్వాసను కానీ చెమటను కానీ విజయవంతంగా గుర్తించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)