అల్జీమర్స్‌ లక్షణాలు ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వీడియో క్యాప్షన్, అంతర్జాతీయ అల్జైమర్స్ దినం సందర్భంగా బీబీసీ ప్రత్యేక కథనం

వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఉన్న వ్యాధుల్లో అల్జీమర్స్‌ ఒకటి.

జ్ఞాపకశక్తి తగ్గిపోయి.. జ్ఞాపకాల్ని మర్చిపోవడమే ఈ వ్యాధి లక్షణం.

ఈ వ్యాధి సోకిన వారిని పసిపాపల్లా చూసుకోవాలి.

అల్జైమర్స్ సోకిన తన తల్లిని బిడ్డలా చూసుకుంటున్నారు ప్రియ.

అంతర్జాతీయ అల్జీమర్స్‌ దినం సందర్భంగా బీబీసీ ప్రతినిధులు సుశీలా సింగ్, బుష్రా షేఖ్ అందిస్తున్న కథనం.

ఈమె ప్రియా. వయసు 44 ఏళ్ళు.

ప్రియా తల్లి విజయ, అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు.

అల్జీమర్స్‌ అనే వ్యాధి వల్ల వ్యక్తి తన జ్ఞాపకాలను కోల్పోతారు.

మొదట్లో ప్రియకు ఈ విషయం తెలుసుకోవడం కష్టమైంది.

''డెహ్రాడూన్‌కు మా తల్లిదండ్రలు ప్రయాణం చేస్తున్నప్పుడు మా అమ్మ వాష్ రూం కి వెళ్లాలనుకున్నారు. తిరిగి వచ్చి నాన్న పక్కన కూర్చున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం..ట్రైన్‌లోకి ఎలా వచ్చాం అని అడగడంతో నాన్న కంగారు పడ్డారు. దాంతో ఆయన అక్కడ నుంచి ఆ రాత్రంతా అమ్మ పక్కనే ఉన్నారు. అంతకు ముందు కూడా ఇలా జరుగుతుండేది. అయితే వయస్సు పెరగడం వల్ల జరిగేదని అనుకున్నాం.''

''రోజులు గడుస్తున్న కొద్ది తన మతిమరుపు ఇంకా ఎక్కువైందని అనిపించింది. తనను తాను అద్దంలో చూసుకొని కోప్పడేది. కుళాయి నీళ్లు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని విసిరేది. పని చెయ్యడం కష్టమయ్యేది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్‌పై పెట్టేది. కానీకానీ కుక్కర్‌లో ఏం ఉండేవి కాదు. నేను తన కూతుర్ని అని కూడా ఆమెకు తెలీదు. నన్ను గుర్తుపట్టలేదు.''

''2021 లో నేను ఆమె ను కేరళ నుంచి ఇక్కడకు తీసుకువచ్చాను. తనకున్న లక్షణాల గురించి గూగుల్‌లో వెతకడం ప్రారంభించాను. బహుశా డిమెన్షియా, అల్జీమర్స్‌ అనుకున్నాను. కానీ స్పష్టత లేదు. దాంతో డాక్టర్ను సంప్రదించి అన్నీ టెస్టులు చేయించాం. రిపోర్ట్‌లో తేలిందేంటంటే తనకు డిమెన్షియా అల్జీమర్స్‌ అని తేలింది. డాక్టర్లకు చూపిస్తే వాళ్లు కూడా అదే అన్నారు. ఇప్పుడు ఆమె కోసం మేం చేయగలిగేది ఏమీ లేదు.''

ప్రియ ప్రస్తుతం తన తల్లిని చంటి పిల్లలాగే చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో డిమెన్షియా కేసులు పెరగచ్చంటున్నారు వైద్యులు. ఇంతకీ దిమెన్షియా, అల్జీమర్స్‌ మధ్య తేడా ఏంటి?

''డిమెన్షియా ఓ సాధారణం పదం. దానిలో అల్జీమర్స్‌లో ప్రత్యేకమైనది. దానినే కామ్‌నెస్ డిమెన్షియా అని అంటారు. 60 నుంచి 70 శాతం మందికి అల్జీమర్స్‌ డిమన్షియానే అవుతుంది. వయస్సు బట్టి రోగి తన ఙ్ఞాపకశక్తిని, పని చేసే సామర్ధ్యాన్ని, సమాజంలో ఆ వ్యక్తి సాధారణ ప్రవర్తన కోల్పోయినట్టు కనిపిస్తాడు. 65 ఏళ్ల వయస్సులో సుమారు 6 శాతం మందికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఉంది.85 ఏళ్ల తర్వాత 30 శాతం అల్జైమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది'' అని న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ ఆనంద్ తెలిపారు.

అల్జీమర్స్‌ లక్షణాలు..

  • మాటలు గుర్తు ఉండకపోవడం
  • దేనిపైనా ఆసక్తి లేకపోవడం
  • మానసిక పరిస్థితి మారిపోతూ ఉండడం
  • కోపం వస్తూ ఉండడం
  • ఎలా జీవించాలో మర్చిపోతూ ఉండడం

అల్జీమర్స్‌ను నివారించే చికిత్సఏదీ లేదని డాక్టర్లు అంటున్నారు.

మనిషి జీవన శైలిలో మార్పు వల్లనే దీని బారి పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.

''డిమెన్షియా బారిన పడకుండా ఉండాలంటే మన డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా సహజంగా లభించే వివిధ రకాల కాయగూరల్ని, పండ్లను తీసుకోవాలి. సామాజికంగా,శారీరకంగా,మానసికంగా ఉత్తేజంగా ఉంటూ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకుంటే డిమెన్షియాను నివారించలేకపోయినా చాలా రోజుల వరకూ ఙ్ఞాపకశక్తిని కోల్పోకుండా ఉండచ్చు'' అని డాక్టర్ రాజీవ్ ఆనంద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)