అనకాపల్లి జిల్లాలో 25 కింగ్ కోబ్రా పిల్లలను ఎలా సురక్షితంగా అడవిలో వదిలారంటే

వీడియో క్యాప్షన్, 25 కింగ్ కోబ్రా పిల్లలను రక్షించిన ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో కనిపించిన 25 కింగ్ కోబ్రా పిల్లలను సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. వి.మాడుగుల మండలం కృష్ణంపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కింగ్ కోబ్రా గుడ్లను విశాఖ ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు ఈ ఏడాది జూన్‌లో గుర్తించారు.

వాటి నుంచి పిల్లలు వచ్చేవరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆగస్టు 14న ఆ గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్లలను గుర్తించిన వారు వాటిని సమీప అడవుల్లో వదిలేశారు.

గుడ్ల నుంచి పిల్లలు వచ్చే వరకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకోవడం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)