You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కామన్వెల్త్ క్రీడలు: అథ్లెట్ల గ్రామం నుంచి కనిపించకుండా పోయిన శ్రీలంక అథ్లెట్లు
బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల కోసం వచ్చిన శ్రీలంక రెజ్లర్ కనిపించకుండా పోయారు. శ్రీలంక బృందం నుంచి ఇలా కనిపించకుండా పోయిన మూడో వ్యక్తి ఈ రెజ్లర్.
అథ్లెట్ల గ్రామం నుంచి గురువారం యోడా పెడిగె షనిత్ చతురంగ అనే రెజ్లర్ బయటకు వెళ్లినట్లు బర్మింగ్‌హామ్ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
జూడో బృందానికి చెందిన ఇద్దరు సభ్యులు కూడా సోమవారం నుంచి కనిపించలేదు. అయితే వీరి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తాజాగా కనిపించకుండో పోయిన రెజ్లర్ కోసం పోలీసులు వెదుకుతున్నారు.
అథ్లెట్ల గ్రామం నుంచి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన జూడో ప్లేయర్ మరప్పులిగె చమీలా దిలానీ, జూడో అధికారి టికిరి హన్నడిగో డుమిందా అసేలా డిసిల్వాలను పోలీసులు గుర్తించారు.
ఇప్పుడు 20 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వ్యక్తి కోసం వెదుకుతున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
సోమవారం వేల్స్‌కు చెందిన అష్లే బర్నికెల్‌తో జరిగిన జూడో తొలి రౌండ్ పోరులో మరప్పులిగె చమీలా ఓటమి పాలయ్యారు.
కనిపించకుండా పోయిన ముగ్గురికీ ఆరు నెలల పాటు వర్తించే వీసాలు ఉన్నాయని, అయితే వారు కనిపించకుండా పోవడానికి కారణమేమిటో కచ్చితంగా చెప్పడం కష్టమని బృందం ప్రతినిధి అన్నారు.
తమ అథ్లెట్లు వారి పాస్‌పోర్టులు, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచడం కోసం సంబంధిత క్రీడా క్రమశిక్షణ అధికారులకు అప్పగించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెప్పారు.
ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్లలో అథ్లెట్లు కనిపించకుండా పోవడం ఇదే మొదటిసారి కాదు.
2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో చాలామంది ఆఫ్రికన్ అథ్లెట్లు అదృశ్యమయ్యారు. 2002 మాంచెస్టర్ క్రీడల్లో 26 మంది ఇలాగే మాయమయ్యారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో 21 మంది అథ్లెట్లు, కోచ్‌లు కనిపించకుండా పోగా... 2011లో సెనెగల్‌కు చెందిన ఫుట్‌బాల్ టీమ్ మొత్తం ఫ్రాన్స్‌లోని తమ హోటల్ నుంచి అదృశ్యమైంది.
ఇవి కూడా చదవండి.
- ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి, భారత్ వృద్ధి మందగమనంలో ఉందా?
- 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది..
- సీఎంకు ప్రత్యేక గది, హెలీప్యాడ్, దాదాపు 10లక్షల సీసీ కెమెరాల అనుసంధానం....కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలేంటి, దానిపై విమర్శలేంటి?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)