విటమిన్ డి అందించే హైటెక్ టొమాటోలు.. ఎలా పండిస్తున్నారో చూడండి

వీడియో క్యాప్షన్, హైటెక్ టొమాటోలు.. ఎలా పండిస్తున్నారో చూడండి

బ్రిటన్ ప్రజలు చలికాలంలో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలని అక్కడ ప్రజారోగ్య విభాగం సూచించింది. కానీ అక్కడి పరిశోధకులు విటమిన్ స్థాయిలను పెంచే జీన్ ఎడిటెడ్ టొమాటోలను పండించారు. ఇంగ్లాండ్‌లో జీన్ ఎడిటెడ్ పంటల పెంపకానికి, వ్యాపార అమ్మకాల అనుమతికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. యూరోపియన్ యూనియన్ నియమాల కారణంగా అది సాధ్యం కాలేదు. దీనిపై మరింత సమాచారం బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ పల్లబ్ ఘోష్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం...

ఈ టొమాటోలతో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యరశ్మిలో లభించే విటమిన్ డి, ఈ టొమాటోలలో లభించేలా ప్రయోగశాలలో అభివృధ్ది చేశారు. నిజానికి డి విటమిన్ సాధారణ టొమాటోలలో ఉండదు. ఎముకలు, కండరాల బలపడడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిటన్‌లో సుమారు 76 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.

ప్రతి రోజు ఓ అరగంట సేపు సూర్యరశ్మిలో నిల్చుంటే మనిషికి సరిపడినంత విటమిన్ డి3 లభిస్తుంది. కానీ చాలా మందికి ఆ సమయం దొరకదు.

అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో జన్యు మార్పిడి పద్ధతిలో ఈ టొమాటోలను పండించారు.

మొక్క DNA నుంచి చిన్న భాగాన్ని తొలగించడం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. జన్యు మార్పిడి పాత పద్ధతిలో జన్యు పదార్థాన్ని జత చేయడం ఉండేది. కొన్ని సందర్భాల్లో అయితే జన్యువులు వివిధ జాతులవి చెందినవి కూడా కావచ్చు.

మిగతా దేశాల్లో ఈ రెండు పద్ధతుల ద్వారా ఆహార ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ యూరప్‌లో మాత్రం కావడం లేదు.

దుకాణాల్లో ఇలాంటి హైటెక్ ఆహార పదార్థాలు లభించవు. భద్రతా కారణాల వల్ల జన్యుపరంగా మార్పు చేసిన పంటలను 25 ఏళ్ల క్రితం యూరప్ నిషేధించింది. 8 ఏళ్ల క్రితం జీన్ ఎడిటింగ్‌కి ప్రాధాన్యత దక్కినప్పటికీ అనుమతి లభించలేదు. ప్రస్తుతం ఉన్న శాస్త్ర పరిజ్ఞానాన్ని గమనించిన బ్రిటన్ ప్రభుత్వం, కొత్త టెక్నాలజీ పూర్తిగా సురక్షితం అని భావిస్తోంది.

హెర్ట్-ఫోర్డ్-షైర్‌లో ఉండే వ్యాపార సంస్థ దశాబ్దాల నుంచి సాంప్రదాయ పద్ధతుల్లో గోదుమలు, బార్లీలలోని కొత్త వంగడాలను తయారు చేస్తోంది. అయితే వాళ్లిప్పుడు జన్యు మార్పిడిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఆహార పదార్థాలు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయని వాళ్లు నమ్ముతున్నారు.

జన్యుపరంగా మార్పు చేసిన పంటలపై 1999లో తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. అప్పటి నుంచి సురక్షితమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. మరోవైపు అప్పుడు వ్యతిరేకించిన వాళ్లు కూడా ఇప్పుడు మనస్సు మార్చుకుంటున్నట్టే కనిపిస్తున్నారు.

కానీ కొత్త జన్యు మార్పిడి పంటలను గుర్తించడం కష్టమని, వాటి నిర్వహణ పారదర్శకంగా ఉండదని, ఇలా అనేక సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా చాలా మందికి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)