శ్రీలంకలో ఆహార కొరత: ఆకలి చావులు తలెత్తే ప్రమాదం ఉందని పార్లమెంటు స్పీకర్ హెచ్చరిక

వీడియో క్యాప్షన్, జీవితంలో ఇంకెప్పుడూ ఆయనకు ఓటు వెయ్యబోమని అక్కడి ప్రజలు ఎందుకంటున్నారు

శ్రీలంక సంక్షోభం నానాటికి మరింతగా తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే విపరీతమైన కరెంట్ కోతలు, పెరిగిన నిత్యావసరాలతో ప్రజలు చీకట్లో మగ్గుతూ, తిండి గింజల కోసం భోజనాలు మానేస్తున్నారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఇలాగే కొనసాగితే తీవ్రమైన ఆహార కొరతతో ఆకలి చావులు తలెత్తే ప్రమాదం ఉందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. మరోవైపు రాజపక్స సోదరులు గద్దె దిగాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజపక్స సోదరుల సొంత గడ్డ అయిన తాంగాల్ పట్టణం నుంచి బీబీసీ ప్రతినిధి రజనీ వైద్యనాథన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)